దీనినే బ్లాక్ క్యారెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో వీటిని వివిధ రకాల పేర్లతో ప్రజలు పిలుస్తూ ఉండడం గమనార్హం. పాకిస్తాన్, టర్కీ , ఆఫ్ఘనిస్తాన్, ఇండియా వంటి దేశాలలో ఎక్కువగా పండిస్తారు. అయితే చాలా మంది ప్రజలు ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్ మాత్రమే తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. నలుపు రంగులో ఉండే క్యారెట్ మాత్రం ప్రజలకు అంతుచిక్కని రహస్యం గా మారిపోయింది.. సాధారణంగా పాశ్చాత్యులు కూడా క్యారెట్ అంటే అది ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది కదా అని నమ్ముతారు కానీ ఆరెంజ్ కలర్ క్యారెట్టు రాకముందు అనగా క్రీస్తు శకం 16 వ శతాబ్దంలో ఈ బ్లాక్ క్యారెట్ ని ఎక్కువగా ఉపయోగించేవారు.. అంతే కాదు ఇవి ఎక్కువగా తూర్పు మరియు ఆసియా మధ్యతర ప్రాంతాలలో విరివిగా అందించినట్లు సమాచారం..

క్యారెట్ బ్లాక్ కలర్ లో మారడానికి గల కారణం ఏమిటంటే ఆంతోసైనిన్ అనే ఒక రంగు అధికంగా ఉండడం వల్ల నలుపు రంగు లోకి వచ్చినట్లు సమాచారం.. వీటిని తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. బ్లాక్ క్యారెట్ లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి కడుపులో మంట, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, మలబద్దకం, వికారం వంటి సమస్యలు దూరమవుతాయి.. విరేచనాలతో బాధపడుతున్నవారు ఈ బ్లాక్ క్యారెట్లు తినడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఇక బ్లాక్ క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇందులో తెల్ల రక్త కణాలు చురుకుగా పనిచేయడానికి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి . ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. ఫ్రీరాడికల్స్ ను నాశనం చేయడంతో పాటు క్యాన్సర్ ను  నిరోధించటంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: