మనం తినే ఆహారంలో పోషకాలు ఉంటే ఎలాంటి వ్యాధులైన మన దగ్గరికి దరిచేరవు. ముఖ్యంగా తీసుకొనే ఆహారంలో అన్ని రకాల ప్రొటీన్లు , విటమిన్లు కూడా ఉండాలి. ఇలాంటివన్నీ ఎక్కువగా ఆకుకూరల లోనే ఉంటాయి. గబచ్చలి కూర లో మన శరీరానికి అవసరమైన పదార్ధాలు అన్నీ ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ బచ్చలి కూరను తింటే దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు వారు తినే ఆహారంలో ఆకుకూరలను ఫ్రై చేసుకొని తినడం వల్ల ఇలాంటి సమస్య నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చని తెలియజేశారు.

ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ బచ్చలి కూర చాలా మెడిసిన్ గా పనిచేస్తుందట. బచ్చలి ఆకు కూర రసాన్ని తాగితే రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ బచ్చలికూర గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. బచ్చలి కూరను తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. ఇక అంతే కాకుండా మన శరీరంలో కొవ్వు శాతం నియంత్రణలో ఉంచడానికి ఇది చాలా సహాయపడుతుంది. బచ్చలి ఆకు కూరలో ఒమేగా -3, ఫ్యాటి ఆమ్లాలు , సెలీనియం అధికంగా ఉంటాయి ఇవి నరాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

ఇక వీటిని బాగా తింటూ ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ బరువుతో బాధపడేవారు ఈ బచ్చలికూర ఒక డైట్ గా ఫాలో కావచ్చు. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తినడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ బచ్చలి కూర తింటే ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుందట. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వేసవికాలంలో ఈ బచ్చలికూర ను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో ఉండే వేడి ని సైతం ఈ ఆకుకూర బయటికి తరిమేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: