నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మ కాయలో ఉండే విటమిన్ సి అనేక అనారోగ్య సమస్యలను చాలా ఈజీగా నయం చేయడంతో పాటు మీ అందాన్ని కూడా చాలా బాగా పెంపొందిస్తుంది.. సాధారణంగా మనం అందరం కూడా కేవలం నిమ్మకాయను మాత్రమే ఉపయోగించే వాటి తొక్కలను పారేస్తూ ఉంటాము.. నిమ్మ తోనే కాదు వాటి తొక్కలతో కూడా బోలెడు ప్రయోజనాలు వున్నాయి. ఎందుకంటే నిమ్మకాయలో బోలెడు ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి..నిమ్మ తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. 20 గ్రాముల నిమ్మ తొక్కల పొడి, 100 గ్రాముల వంట సోడా ఇంకా అలాగే 100 గ్రాములు ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఇక ఈ పొడితో కనుక మీరు పళ్లు తోముకుంటే పంటి మీద గార తొలగిపోయి దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.



ఈ  నిమ్మ తొక్కల పొడి ని మీరు ఉపయోగించే వంటలలో ఒక చెంచా గనుక కలిపితే డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఇంకా క్యాన్సర్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఎండబెట్టిన నిమ్మ తొక్కలను గ్రీన్ టీ ఇంకా అలాగే హెర్బల్ టీ లో కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. దంత సమస్యలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.నిమ్మ తొక్కల్ని తీసుకొని ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఒక చెంచా నిమ్మ పండు లో తగినన్ని పాలు కలిపి బాగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో నీట్ గా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ క్రీమ్స్ ఉపయోగించే దాని కంటే ఇలా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మొటిమలు కూడా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: