మన దేశంలో ఆయిల్ లేకుండా రుచికరమైన వంటలనేవి దాదాపు అసాధ్యం అని చెప్పాలి. కానీ అవసరాన్ని మించి వంట నూనె వాడితే మాత్రం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమనే విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన ఆహారం శరీరపు పీహెచ్ స్థాయిని ఖచ్చితంగా అదుపు తప్పేలా చేస్తుంది. దాంతో కడుపులో కొవ్వు పెరగడం, అజీర్ణం, గ్యాస్ ఇంకా మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. మనం తినే ఆహారంలో శాచ్యురేటెడ్ ఆయిల్ ఎక్కువగా ఉండటం లేదా వెజిటెబుల్ ఆయిల్ చాలా ఎక్కువగా వినియోగించడమనేది చాలా ప్రమాదకరమని చాలా అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. అందుకే ఈ కేన్సర్‌కు కారణమయ్యే.. అటువంటి వంటనూనెల్ని వెంటనే మీ కిచెన్ నుంచి తీసేయండి.సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామ్ ఆయిల్‌లు ఎక్కువగా వేడెక్కే కొద్దీ ఎల్‌డిహైడ్ కెమికల్ రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్ కేన్సర్ పుట్టించే కారకం. దీనివల్ల శరీరంలో కేన్సర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. అందుకే ఈ ఆయిల్స్ వాడకాన్ని తక్షణం నిలిపివేస్తే చాలా మంచిది.



కొన్ని రకాల వంటనూనెల్లో పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీటిని హై టెంపరేచర్‌పై వేడి చేస్తే ఎల్‌డిహైడ్‌గా కూడా విడిపోతుంటుంది. ఇక డీమోన్ ఫోర్ట్ యూనివర్శిటీలో చేసిన ఓ అధ్యయనం ప్రకారమైతే..కొన్ని వంటనూనెల్లో రోజువారి పరిమితి కంటే 2 వందల రెట్లు ఎక్కువ ఎల్‌డిహైడ్ అనేది ఉత్పన్నమవుతుందట.కొన్ని రకాల వంటనూనెలతో అయితే కేన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రదానంగా నెయ్యి, వైట్ బటర్ ఇంకా ఆలివ్ ఆయిల్ ప్రధానంగా ఉంటాయి. వీటిని వేడిచేస్తే ఎల్‌డిహైడ్ చాలా తక్కువగా విడుదలవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ కూడా ఆయిల్ లెస్ ఆహారపదార్ధాలు అలవర్చుకుంటే చాలా మంచిది. అలా చేస్తే కేన్సర్ ఒక్కటే కాకుండా డయాబెటిస్ ఇంకా అలాగే గుండె సంబంధిత రోగాలు కూడా దూరమౌతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: