పుదీనాలో మెంథాల్, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్, విటమిన్-ఎ, రైబోఫ్లావిన్, కాపర్‌ ఇంకా ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పుదీన కడుపు సంబంధిత అనేక వ్యాధులను ఈజీగా తొలగిస్తుంది. ఈ కారణంగా దీనిని ఎక్కువగా ఔషధాలలో దీన్ని ఉపయోగిస్తారు. పుదీనా ఆకులను తీసుకుంటే వాంతులు ఆగిపోయి కడుపులోని గ్యాస్ కూడా తొలగిపోతుంది. ఇది గడ్డకట్టిన కఫాన్ని కూడా ఈజీగా బయటకు తీసుకొస్తుంది.పుదీనా ఇంటి పనులకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల ఇంట్లో ఉండే బ్యాక్టీరియా ఇంకా ఫంగస్‌ను తొలగించవచ్చు. అయితే ఇంటి పనులలో పుదీనాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక వేసవిలో ఇంటి మూలల్లో చీమలు ఎక్కువగా ఉంటాయి. వీటని తరిమికొట్టడానికి మీరు పుదీనాతో చేసిన స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లో ఎక్కడ చీమలు కనిపించినా పుదీనా స్ప్రే చేస్తే అన్ని కూడా పారిపోతాయి.



బాత్రూమ్‌లోని మురికిని తొలగించడానికి కూడా మీరు పుదీనా సహాయం తీసుకోవచ్చు. బాత్‌రూమ్‌లో వచ్చే వాసన ఈజీగా తొలగిపోతుంది. ఇందుకోసం పుదీనా ఆకులను నీళ్లలో గ్రైండ్ చేసి అందులో బేకింగ్ సోడాని కలపాలి. ఇప్పుడు ఈ నీటిని బాటిల్‌లో స్టోర్ చేసి మురికిగా ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఆపై బ్రష్ సహాయంతో బాగా శుభ్రం చేయాలి.అలాగే వంటగదిలో పేరుకుపోయిన మురికిని ఇంకా ఇక్కడ ఉన్న సింక్‌ను శుభ్రపరచడానికి మీరు పుదీనా సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం పుదీనా ఆకులను బాగా గ్రైండ్ చేసి అందులో వెనిగర్ మిక్స్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇప్పుడు అందులో కొంచెం నీళ్లు మిక్స్ చేసి బాటిల్‌లో స్టోర్ చెయ్యాలి.తరువాత దీనిని వంటగదిలో స్ప్రే చేయాలి. ఇలా మూడు వారాల పాటు స్ప్రే చేస్తుంటే చక్కటి మార్పుని మీరు గమనిస్తారు. అలాగే వంటగదిలో ఉండే క్రిములు ఈ స్ప్రే నుంచి పారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: