ప్రతి ఒక్కరూ ఏదో విధంగా కష్టపడుతూనే ఉన్నారు. కొంతమంది జీవనోపాధి కోసం కష్టపడుతూ ఉంటే మరి కొంత మంది తమ శరీరంలో ఉండే ఫ్యాట్ ని కరిగించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. ఇక కొంతమందికి ఎండలో వెళ్లగానే మొత్తం శరీరమంతా చెమటలు పట్టడం ఫలితంగా శరీరం నుండి దుర్వాసన వంటివి మొదలవుతుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే చెమట లేకుండా కూడా శరీరం నుండి వాసన వస్తూ ఉంటుంది. ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి. కొన్ని కొత్త విషయాలను తెలియజేశారు వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


 సైన్స్ ప్రకారం శరీరం లో చెమటతో రెండు రకాల గ్రంథులు ఉంటాయట. మొదటి గ్రంధి "మాక్రైన్" స్వేద గ్రంధులు ఇది వాసనలేని నీటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంటే చెమట పట్టడం.. ఇక మరొక గ్రంధి.. అపో క్రీన్  చెమట గ్రంథులు వాసనకు ఇదే ముఖ్య కారణం. ఎక్కువగా వెంట్రుకలు ఉన్న ప్రదేశాలలోని అపో క్రీన్ చెమట గ్రంధులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇది చమురు లాంటి రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ రసాయనం శరీరంలో దుర్వాసనను కలిగించేలా చేస్తుంది. అందుచేత ఒక వ్యక్తి ఒత్తిడికి ఆందోళనకు నొప్పి అనుభవించిన అప్పుడల్లా ఈ గ్రంధి తరచుగా మారుతూ ఉంటుంది. దీని ఫలితమే దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది.

నిజానికి ఈ గ్రంధి నుండి బయటికి వచ్చే  ద్రావనికి వాసన ఉండదు.. శరీరం చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో ఇది సంబంధం వచ్చినప్పుడు నూనె కొవ్వు ఆమ్లాలు గా మారుతుంది.. అప్పుడు ఈ రెండు కలిసి బయటికి రావడం వల్ల వాసన ఉత్పత్తి చేసే సమ్మేళనం జరుగుతుందట. అపో క్రీన్ చెమట గ్రంధులు యవ్వనంగా ఉన్నవారిలో చురుకుగా ఉండవు.. అందుచేతనే చిన్న వయసులో శరీర దుర్వాసన అనేది ఎక్కువగా కనిపించదు. కేవలం ఇదీ ఒక ఏజ్ వారిలో వస్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: