ఎక్కువమంది ఖాళీ కడుపుతో పలు రకాల జ్యూసులను తాగుతూ ఉన్నారు. ఇక డైట్ చేసేవారు ప్రత్యేకంగా తాగుతూ ఉంటారని చెప్పవచ్చు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మానేసి ఏదో ఒక జ్యూస్ తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం అని వైద్యులు తెలియజేస్తున్నారు. మార్నింగ్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ లో పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఇక అంతే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో చల్లని జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ఉండే శ్లేష్మ పొరలు చాలా దెబ్బతింటాయట.

అందుకే ఉదయం నిద్రలేవగానే జ్యూస్ తాగే అలవాటు మానుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత జ్యూసును డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిదట. ఇది మనకు పూర్తి పోషకాహారాన్ని అందిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి అందుచేతనే వీలైనంత వరకు ఎవరైనా బ్రేక్ ఫాస్ట్ మానేసి.. జ్యూస్ తాగక పోవడమే మంచిదని తెలియజేస్తున్నారు నిపుణులు.


కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష పండు, సిట్రస్ పండ్ల రసాలను ఉదయం పూట తాగడం మానుకోవాలి అట. ఎందుచేతనంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తాగడం వల్ల మన కడుపులో ఆమ్లత్వం పెరిగిపోతుంది.అయితే ఇది అందరికీ హానికరం కాదు కానీ తాజా పండ్ల రసం తాగడం వల్ల శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది . అయితే కొన్ని ప్రతికూలతలను కూడా కలిగి ఉంటుంది. ఈ జ్యూస్లో శరీరానికి అవసరమైన మినరల్స్ , విటమిన్లు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అందుచేతనే ఉదయం పూట ఎక్కువగా జ్యూస్ చాలామంది తాగుతూ ఉంటారు అని కొన్ని పరిశోధనలో తెలియజేయడం జరిగింది. అయితే జ్యూస్ వంటివి ఏదైనా ఆహారం తిన్న తర్వాత మాత్రమే తాగడం మంచిదని మాత్రం నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: