డయాబెటిస్ అనేది చికిత్స చేయలేని వ్యాధి. కానీ దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. స్టార్చ్ లేని అన్నం తినేటప్పుడు మీరు ఫిట్‌గా ఇంకా ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చో, షుగర్ లెవల్స్ పెరగకుండా  మెయింటైన్ చేయొచ్చు..అయితే మధుమేహం వచ్చిన వాళ్లు కొన్ని చిట్కాలని పాటించాలి. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అనేది అదుపులో ఉంటుంది.చాలా మంది కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తినడానికే చాలా ఎక్కువ ఇష్టపడుతుంటారు. కానీ అన్నం తినడం వల్ల వారికి చాలా హాని అనేది కలుగుతుంది. ఇది మీ శరీర బరువును కూడా పెంచుతుంది. దీనికి కారణం అన్నం సరిగ్గా ఉడికించకపోవడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని కారణంగా అన్నంలో పోషణ అనేది తొలగించబడుతుంది, అయితే దాని హానికరమైన మూలకం ఆర్సెనిక్ అనేది శరీరంలోకి వెళుతుంది. అందువల్ల, బియ్యం ని సరిగ్గా ఉడికించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ అన్నం వండడానికి సరైన మార్గాన్ని వివరించారు యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ శాస్త్రవేత్తలు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇక శాస్త్రవేత్తలు ఈ బియ్యాన్ని వండే పద్ధతికి PBA అని పేరు పెట్టారు. అంటే శోషణ పద్ధతితో పార్బాయిలింగ్. ఇక దీనిని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ కనుగొన్నారు. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురించబడిన పరిశోధనలో ఈ PBA పద్ధతి అనేది వివరించబడింది.


పార్బాయిలింగ్ అంటే వెచ్చని నీళ్ళతోనూ ఆవిరితోనూ వరిబియ్యాన్ని సగం ఉడకబెట్టి,ఇక దాని నాణ్యతను మెరుగుపరచే ఒక పద్ధతిని పార్బాయిలింగ్ అంటారు. ఇక ఈ పద్ధతి ప్రకారం, ముందుగా బియ్యం బాగా కడిగిపెట్టాలి, తరువాత అందులో అన్నం సిద్ధం చేయడానికి ముందు 5 నిమిషాలు ముందు కడిగిపెట్టాలి. ఇది ఆర్సెనిక్‌ను ఈజీగా తొలగిస్తుంది.ఇక దీని తరువాత, బియ్యంలో నీరు పోసి తక్కువ మంటపై ఉడికించాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత గంజిని పూర్తిగా వంపి, మరికొద్దిసేపు స్టౌ మీద ఆవిరిపై పెట్టి,తరువాత నీటిని బాగా పీల్చుకున్నప్పుడు, గ్యాస్ ఆఫ్ చేయాలి. ఈ పరిశోధన ప్రకారం, ఈ విధంగా బియ్యం వండినట్లయితే, బ్రౌన్ రైస్ నుండి 50 శాతం వరకు కూడా ఆర్సెనిక్ తొలగించబడుతుంది, అయితే వైట్ రైస్ నుండి 74 శాతం వరకు ఆర్సెనిక్ అనేది తొలగించబడుతుంది.ఈ PBA సాంకేతికతతో అన్నం వండడం వల్ల అందులో ఉండే స్టార్చ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు హాని కలిగదు. అలాగే స్టార్చ్ తక్కువగా ఉన్నప్పుడు, అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అనేది ఒక్కసారిగా పెరగదు. మీరు ఈ విధంగా వండిన అన్నం తినడం వల్ల మీరు బరువు పెరగరు.పైగా మీరు మీ బరువును సులభంగా నియంత్రించగలుగుతారు. షుగర్‌ లెవల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచగలుగుతారని ఆరోగ్య నిపుణులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: