సాధారణం గా శృంగారం లో పాల్గొన్న సమయం లో ఆడవారు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భ నిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలం లో పిల్లలను ఎప్పుడు కనాలి అని ప్రతి ఒక్కరూ ఒక టైం పెట్టుకుంటున్న నేపథ్యం లో ఇక గర్భ నిరోధక మాత్రలు వాడటం సర్వ సాధారణం గా మారి పోయింది. ఒకవేళ మహిళలు గర్భ నిరోధక మాత్రలు వాడటానికి ఇష్ట పడకపోతే ఇక పురుషులు కండోమ్స్ లాంటివి వాడటం ద్వారా ఇక శృంగారం లో పాల్గొన్నప్పుడు అవాంఛిత  గర్భం దాల్చకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు.


 ఇక ఈ విషయం లో దాదాపు నేటి రోజుల్లో యువతకు పెద్దలకు అందరికీ కూడా అవగాహన ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భ నిరోధక మాత్రలను వాడటం.. పురుషులు ముందు జాగ్రత్త చర్యలో భాగం గా కండోమ్  వాడటం లాంటివి మాత్రమే చూశాము. కానీ ఇప్పుడు మాత్రం పురుషులకు కూడా మహిళ లాగానే గర్భ నిరోధక మాత్రలు అందుబాటు లోకి రాబోతున్నాయి అనేది తెలుస్తుంది. పురుషులకు గర్భ నిరోధక మాత్రలు ఏంటి.. ఇదేదో విచిత్రం గా ఉంది అని అనుకుంటున్నారు కదా.


 ఇటీవల నిర్వహించిన సరికొత్త పరిశోధన లో పురుషులకు కూడా గర్భ నిరోధక మాత్రలు అందుబాటు లోకి వచ్చాయట. ఇక కండోమ్స్ కు బదులు తాము తయారుచేసిన గర్భనిరోధక మాత్రలు మహిళల అవాంఛిత గర్భధారణను నివారించడంతో సమర్థవంతంగా పనిచేస్తాయని యూనిస్ కిన్నెడి శ్రీవార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు తమర్ జాకబ్సన్ తెలిపారు. DMAU, 11b-MNTDC  అనే రెండు పురుష గర్భనిరోధక మాత్రలు. ప్రొజెస్ట్రోజెనిక్, ఆండ్రోజెన్ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయన్నారు. ఇవి టెస్టోస్టిరాన్ఫార్ములా,స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తూ గర్భం దాల్చకుండా చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు పరిశోధకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: