ఇటీవల కాలంలో చాలామంది జీవనశైలిలో మార్పులు రావడం వల్ల తీసుకునే ఆహారంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం,  బయట ఫుడ్డు కు ప్రాధాన్యత ఇవ్వడం , పరిమితికి మించి ఎక్కువ ఆహారం తీసుకోవడం లాంటి ఎన్నో కారణాల వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి వాటిలో కడుపు నొప్పి , కడుపు ఉబ్బరం,  గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ప్రధానంగా వస్తున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఇక ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవడానికి రకరకాల మందులను కూడా ఉపయోగిస్తున్నారు.అయితే ఇలాంటి మందులు ప్రస్తుతానికి తక్షణ ఉపశమనం కలిగించినా.. భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ కి కారణం కావచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి గ్యాస్ ట్రబుల్ ను దూరం చేసుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయానికి వస్తే.. క్రేన్ బెర్రీస్ గ్యాస్ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇక మనకి ఇవి బయట మార్కెట్లో దొరకకపోయినా ఆన్లైన్ షాపులలో ను , డ్రై ఫ్రూట్స్ షాప్ లలో ఎక్కువగా దొరుకుతాయి. క్రేన్ బెర్రీస్ తినడం వల్ల మనకు విటమిన్ ఏ , విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె తో పాటు విటమిన్ b6 అలాగే విటమిన్ బి 5 వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. అలాగే క్యాల్షియం , మెగ్నీషియం , పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి తగిన మోతాదులో లభిస్తాయి.

ఇక ఇన్ని పోషకాలు కలిగి ఉన్న క్రేన్ బెర్రీస్ ను ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలను పొందడంతో పాటు కడుపు ఉబ్బరం, అజీర్తి , గ్యాస్ట్రబుల్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను కూడా నయం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇతర ఇన్ఫెక్షన్లకు గురికాకుండా  శరీరాన్ని ఈ క్రేన్ బెర్రీస్ కాపాడతాయి. ఇక గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ఒక గ్లాస్ నీటిలో కొన్ని క్రేన్ బెర్రీస్ ను ఉడికించి వడకట్టి..ఆ నీళ్లు తాగితే గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: