ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య ఎక్కువయింది. ఈ మధ్య కాలం లో కొందరు సెలబ్రిటీలు సైతం గుండె జబ్బులతో మరణించారు. ఒత్తిడి పెరిగిన కారణం గానే చాలా మందిలో గుండె పాటు వస్తున్నట్లు అంటున్నారు. అయితే పరుగులు తీస్తున్న రోజుల్లో జనాలు ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందులోనూ ఈ ఫాస్ట్ జనరేషన్ లో మారిన జీవన శైలి కారణంగా...ఒత్తిడి కారణంగా చాలా మంది ఎక్కువ మంది హృద్రోగ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. వీటిలో చాలా మంది మృత్యువాత పడుతుండటం దురదృష్టకరం. అయితే చాలామంది అధికంగా వ్యాయామం చేయడం వలన కూడా ఇలా సడెన్ గా హాట్ స్ట్రోక్ ల వలన చనిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

నిత్యం లక్షలాది మంది వ్యాయామం చేస్తుంటారు. అనారోగ్యం బారిన పడినవారు వైద్య నిపుణుల సలహాలతో వ్యాయామం చేయడానికి మొగ్గు చూపుతారు. అయితే ఇలా తమ అనారోగ్యం కారణంగా వ్యాయామం చేయాలి అనుకున్న వారిలో చాలా మంది ఎక్కువగా తమ సొంతంగా ప్రయోగాలు చేయడం లేదా ఇంకొందరు సామాజిక మాధ్యమాలలో చూసి వారు చెప్పే టిప్స్ ఫాలో అవ్వడం వంటివి చూసి చేస్తూ హఠాత్తుగా గుండె పోటుకు గురవుతున్న సందర్భాలు కూడా ఎక్కువగా తలెత్తుతున్నాయి. అసలు వ్యాయామాలు అనేవి
ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని చేయరాదు.

డాక్టర్లు లేదా నిపుణులు సలహా మేరకు మీ ఆరోగ్యం, శరీర బరువును బట్టి చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఏదో వెంటనే కేజీలు కేజీలు బరువు తగ్గిపోవాలని పెద్ద పెద్ద స్టంట్స్ చేయడం కూడా పెద్ద పొరపాటే అంటున్నారు నిపుణులు.  ఇక ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా జీవన విధానంలో వచ్చిన మార్పులు, మారిన అలవాట్లు తదితర కారణాల వలన కూడా గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: