ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వరుసగా ఐదు లక్షలకుపైగా మెడ క్యాన్సర్‌ కేసులు ఇంకా 2 లక్షలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.కాబట్టి ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. అవగాహన పెంచుకుంటే క్యాన్సర్‌ బారిన పడకుండా ముందస్తుగా మీరు అప్రమత్తం కావచ్చు. గ్లోబోకాన్‌ 2020 ప్రకారం.. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 2,52,772 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ముంబైలోని అపోలో క్యాన్సర్ సెంటర్ ఆంకాలజీ సర్వీసెస్ హెడ్ అండ్ నెక్ ఆంకోసర్జన్ ఇంకా డైరెక్టర్ డాక్టర్ అనిల్ డిక్రూజ్ తెలిపారు.ఇక గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (GATS) డేటా ప్రకారం, స్త్రీల కంటే పురుషులే ఎక్కువ పొగాకును వినియోగిస్తున్నారు. అందువల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఇంకా వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అలాగే పొగాకు సంబంధిత క్యాన్సర్లు మహిళల్లో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, థైరాయిడ్ వంటి కొన్ని క్యాన్సర్లు అనేవి సాధారణంగా మహిళల్లో సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఇక దీనికి ప్రధాన కారణాలు ముఖ్యంగా పొగాకు, మితిమీరిన మద్యపానం. ఇంకా ఇది కాకుండా ఓరోఫారింక్స్ (టాన్సిల్స్, నాలుక)ను ప్రభావితం చేసే HPV (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) క్యాన్సర్. ఇది ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తున్నా కూడా మన దేశంలో కూడా పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఇంకా ఓరల్ సెక్స్ వల్ల HPV సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి.ఇక పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించిన అవగాహన చేసుకోవడంతో పాటు వాటిని పాటించినప్పుడు క్యాన్సర్ల బారి నుంచి రక్షించుకోవచ్చంటున్నారు పలు వైద్య నిపుణులు. పొగాకు వినియోగాన్ని నిలిపివేయడం లేదా డి-అడిక్షన్ ప్రోగ్రామ్, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇంకా సురక్షితమైన లైంగిక వ్యవస్థ ద్వారా HPV క్యాన్సర్‌ను నివారించవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.పోగాకు, మద్యం అలవాటు ఉంటే ఈ క్యాన్సర్ రావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: