శరీరం నుండి మలినాలను బయటకు పంపించడం, రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడం ఇంకా శరీరానికి అవసరమయ్యే కొలెస్ట్రాల్ ను తయారు చేయడం అలాగే మనం తిన్న ఆహారం నుండి పోషకాలను వేరు చేయడం వంటి వివిధ రకాల విధులను కాలేయం నిర్వర్తిస్తుంది.దాదాపు 500 రకాల విధులను కాలేయం ప్రతిరోజూ కూడా నిర్వర్తిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత తరుణంలో కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకూ చాలా ఎక్కువవుతోంది.కాలేయం వాపు, కామెర్లు ఇంకా హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ లతోపాటు ఫ్యాటీ లివర్, కాలేయంలో గడ్డలు అలాగే కాలేయ క్యాన్సర్ వంటి రకరకాల కాలేయ సంబంధిత సమస్యలు వస్తున్నాయని చెప్పవచ్చు. కాలేయ సంబంధిత సమస్యల బారిన పడకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి మీదనే మన కాలేయం పనితీరు ఇంకా ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాలేయం అనేది ఆకస్మాత్తుగా పాడవదు. కొద్ది రోజుల నుండి ఈ సమస్య ఉన్న తరువాతనే మనలో లక్షణాలు బయటకు కనడబతాయి.ఇక శరీరంలో ఏ ఇతర అవయావాలు పాడైనా వాటిని నయం చేసుకోవడం చాలా కష్టం. కానీ కాలేయాన్ని మాత్రం మనం ఈజీగా నయం చేసుకోవచ్చు.తిరిగి ఆరోగ్యవంతంగా కూడా మార్చుకోవచ్చు.


దీని కోసం మనం ఎల్లప్పుడూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా శరీర బరువు నియంత్రణలో ఉండాలి. మద్యపానం, ధూమపానం వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజూ కూడా 8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి.అలాగే మనం తీసుకునే ఆహారాన్ని కూడా సరైన సమయానికి తీసుకోవాలి.అలాగే నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.అలాగే మనం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను కూడా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని, ఇంకా జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. అదే విధంగా ఆకు కూరలను ముఖ్యంగా పాలకూరను మన ఆహారంలో భాగంగా ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్, బీట్ రూట్, నిమ్మరసం, గ్రీన్ టీ, పసుపు, అవకాడో, వెల్లుల్లి ఇంకా ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.వీటిని తీసుకోవడం వల్ల కాలేయం బాగా శుభ్రపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: