హోమియోపతి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఇక హోమియోపతి మందులను రొటీన్ గా తీసుకునేవారు.. మొదట్లో వాటిని సురక్షిత ప్రాంతాల్లోనే పెట్టుకుంటారు. కానీ కొన్ని సార్లు అయితే ఏమి జరుగుతుందిలే అని భావించి .. చాలా అజాగ్రత్తగా ఎక్కడబడితే అక్కడ పెట్టడం మొదలుపెడతారు. అయితే మీరు ఈ హోమియోపతి మందులను తెరిచి ఉంచకపోయినా, వాటిని ఉంచేటప్పుడు.. ఉష్ణోగ్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హోమియోపతి మందులను ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా అధిక వేడిలో కనుక ఉంచినట్లయితే.. వాటిని శరీరంలోకి తీసుకున్న తర్వాత ఆ మందుల నుంచి సైడ్ ఎఫెక్ట్ ను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది.అంతేకాదు హోమియోపతి మందులను పెర్ఫ్యూమ్స్, సెంట్లు ఇంకా ఫేస్ పౌడర్లు వంటివి ఉన్న ప్రాంతాల్లో పెట్టరాదు.ఈ హోమియోపతి మందులను తాకరాదు.హోమియోపతి మందులను డైరెక్ట్ గా తమ చేతుల్లోకి తీసుకుని అనంతరం వాటిని నోట్లో వేసుకుంటారు. అయితే ఇలా ఏ ఔషధాన్ని అయిన సరే.. చేతులతో తాకడం చాలా హానికరం.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మందులను తాకడం ద్వారా, చాలా సూక్ష్మక్రిములు వాటిపై చేరుకుంటాయి. ఈ జెర్మ్స్ కారణంగా, హోమియోపతి ఔషధం చాలా హానికరంగా మారవచ్చు. కనుక బద్దకంతోనో.. లేక మరేదైనా కారణంతోనో హోమియోపతి మందులను తీసుకునే విషయంలో చేసే పొరపాటు చాలా నష్టాన్ని కలిగిస్తుంది.అలాగే లోహంతో తయారు చేసిన వస్తువులతో హోమియోపతి మందులు అస్సలు వినియోగించరాదు. ఈ విషయం చాలా మందికి కూడా తెలియదు. హోమియోపతి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలు తరచుగా ఈ పొరపాటు అనేది చేస్తారు. అప్పుడు మందులు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. మీరు హోమియోపతి ఔషధాన్ని ద్రవ రూపంలో కనుక తీసుకుంటే.. ఎల్లప్పుడూ గాజు గ్లాసుని మాత్రమే ఉపయోగించండి.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు లేకుండా జీవించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: