చాలామంది కూడా సరైన బరువును మైంటైన్ చేసేందుకు ఎక్కువ సమయం జిమ్‌లలో గడుపుతున్నారు. అలాగే ప్రత్యేక డైట్‌లు కూడా పాటిస్తున్నారు. అయితే మీ జీవనశైలి, తినే ఆహార పదార్ధాల విషయంలో పలు మార్పులు చేర్పులు చేస్తే.. బరువును ఈజీగా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చునని వైద్యుల సలహా ఇస్తున్నారు.మామిడిపండ్లు తాజాగా ఉండేందుకు రసాయనాలు వాడతారని.. చాలామంది తొక్క తినడానికి ఆలోచిస్తారు. అయితే తోటలో పండినవి, సహజంగా మగ్గినవి అయితే తొక్కతో తినడం మంచిది. ఇందులో పీచు శాతం అధికంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లూ, ఒమేగా 3, ఒమేగా 6 అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన స్టామినాను అందించడంలో సహాయపడుతుంది.కాగా, ఇవే కాదు నారింజ, వంకాయ, అరటి, కివీ లాంటి వాటిని కూడా తొక్కతో తినడమే మంచిది. ఇలా తినడం వల్ల తగినన్ని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి అందుతాయి.చాలామంది కీరదోసను ముక్కలుగా కోసుకుని తినడం లేదా సలాడ్‌గా తింటుంటారు. అయితే ఈ కీరదోసను తొక్క తీసి తినడం కంటే.. తొక్కతో తినడం వల్ల ఎక్కువ లాభం చేకూరుతుంది.


 కీరదోస తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడమే కాదు.. రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది.పండ్లు లేదా కూరగాయలు.. ఎక్కువ పొట్టు, పీచు ఉన్నవి తింటేనే బరువు తగ్గడంలో తోడ్పడతాయని డాక్టర్ల సూచన. పీచు పదార్ధం ఎక్కువగా తిన్నట్లయితే.. మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆకలి అనేది తగ్గుతుంది. పీచుతో జీర్ణకోశ వ్యవస్థ మెరుగుపడటమే కాదు.. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.చాలామంది బంగాళదుంపల తొక్కను తీసేస్తుంటారు. అయితే అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదని వైద్యులు అంటున్నారు. దుంపలో కంటే దాని తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయట. తొక్కతో ఉడికించిన బంగాళదుంపలలో విటమిన్-సి, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్ 100 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: