30 ఏళ్ల తర్వాత ప్రతి వ్యక్తిలో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని జీవనశైలి విధానంలో మార్పులు చేసుకుంటే ఎంతో మంచిదంటున్నారు. గత మూడేళ్లుగా కరోనాతో ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఎవరి పనులు వారు సజావుగా కొనసాగిస్తున్నారు. కరోనా వచ్చిన నాటి నుంచి రకరకాల వేరియంట్లతో వైరస్‌లు మరింతగా వెంటాడుతున్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్యులు. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడంతో పాటు పండ్లు, వ్యాయమాలు చేయడం వంటివి పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు. 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటే.. చాలా మంది యువతలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. బలహీనంగా మారుతున్నారు.ఆహారం, జీవనశైలి కాకుండా, హార్మోన్ల మార్పుల కారణంగా తరచుగా 30 ఏళ్ల తర్వాత బట్టతల రావడం ప్రారంభమవుతుంది. అలాంటి వారు హెయిర్ ఫాల్‌ను ప్రారంభంలోనే ఆపడానికి ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.


30 ఏళ్ల తర్వాత పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ స్థితిలో వారు అధిక మూత్రవిసర్జన, మూత్రంలో మంట వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జంకుఫుడ్డు, ప్రోటీన్స్‌ ఉన్న ఆహారం తీసుకోకపోతే శరీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే 30 ఏళ్ల తర్వాత చాలా మందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మంచి ఆహారం, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.జీవక్రియ రేటు మందగించడం వల్ల పురుషులలో ఊబకాయం సమస్య వస్తుంటుంది. 30 ఏళ్లు దాటితేనే ఊబకాయం కనిపిస్తుందని కాదు.. జీవనశైలి సరిగా లేకున్నా, ఆహారం సరిగా లేకుంటే స్థూలకాయం మనల్ని ఎప్పుడైనా వెంటాడవచ్చు. అందుకే ఆహార నియమాలు పాటించడం ఎంతో మంచిదంటున్నారు.30 ఏళ్ల వయస్సులో మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో బాధ్యతల కారణంగా చాలా మంది ఎముకలలో నొప్పితో బాధపడుతుంటారు. ఎముకలు బలహీనపడటమే దీనికి కారణం. ఎముకలకు విటమిన్స్‌ లోపం కారణంగా సమస్య వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: