ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటి కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. దీన్ని మనదేశంలో ఎన్నో రకాల వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి తినడానికి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. బెండకాయలలో ఎక్కువగా మినరల్స్, ఫైబర్, విటమిన్లు చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇందులో కొవ్వు పదార్థాలు,కార్బోహైడ్రేట్ ,క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం, ఐరన్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలే కాకుండా మెదడు పనితీరును సరిగ్గా పని చేయడానికి అవసరమైన పోషకాలు కూడా ఇందులో చాలానే ఉంటాయి. అంతేకాకుండా బెండకాయ ఆధారం బరువు కూడా తగ్గవచ్చు.

వాస్తవానికి బెండకాయల క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ కంటేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బెండకాయలలో ఉండే  ఫైబర్ కరిగి శరీరంలో చెడు పదార్థాలను సైతం తొలగించడానికి చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులను నివారించడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. బెండకాయ జీర్ణ వ్యవస్థలు చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి పలు రకాలుగా సహాయపడుతుంది.


చిన్నపిల్లలు ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే బెండకాయతో ఆహారాన్ని తినిపించడం మంచిది. బెండకాయలు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని చాలా బలంగా ఉంచేలా చేస్తుంది. దీని ద్వారా వివిధ వ్యాధులు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బెండకాయ లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు వల్ల ఫ్రీ రాడికల్ వల్ల కలిగే నష్టం నుండి చాలా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా వాటిని నివారిస్తుంది. బెండకాయ శరీరంపై సీదళీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుచేతనే అటువంటి పరిస్థితిలో ఇవి వేసవికాలంలో బాగా తినడం మంచిది. బెండకాయ ఫ్రై చేసుకుని తినేటప్పుడు మసాలాలు వేయడం వల్ల మన శరీరం చాలా వేడిని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: