పండ్లు మన ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. పెద్ద పెద్ద వైద్యులు కూడా మనిషి ఆరోగ్యానికి రకరకాల పండ్లు తినమని సలహాలు ఇస్తుంటారు.అయితే ప్రకృతి నీడలో సహజసిద్ధంగా పండిన పండ్లతో చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఏ పండ్లూ కూడా సహజసిద్ధంగా పండినవి అస్సలు లభించడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే.. అడవిలో సహజసిద్ధంగా లభించే అద్భుతమైన ఔషధ ఫలం ఏంటంటే అదే నెక్కెర కాయ.అయితే ఇవి కాస్త జిగురు తత్వాన్ని కలిగి ఉండటం వలన వీటిని బంక నెక్కెర కాయలు అని కూడా అంటారు. ఇంగ్లీషులో గ్లూ బెర్రీస్గా పిలువబడే ఈ పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అసలు అన్నీ ఇన్నీకావు. సహజంగా 40 సంవత్సరాలు పై బడిన వారికి మోకాళ్ళ నొప్పులనేవి సహజంగా వస్తుంటాయి. అయితే అలాంటి వారు ఈ బంకనెక్కర పండ్లని కనుక తింటే మోకాలిలో గుజ్జు తయారు అయ్యి మోకాళ్ళ నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. 


అలాగే కండరాల క్షీణతకు ఈ పండు అద్భుతమైన ఔషధంగా చెబుతారు. షుగర్‌ ఇంకా బీపీని కూడా ఈజీగా కంట్రోల్‌ చేస్తుంది. జలుబు, దగ్గు ఇంకా ఆస్తమా వంటి వ్యాధులకు ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా అంతేకాదు, ఈ నేచురల్‌ ఫ్రూట్‌ మేల్‌ సెక్స్‌ పవర్‌కు చాలా బాగా పనిచేస్తుందని తేలింది. అలాగే ఈ చెట్టు ఆకులు కూడా ఔషధమే అంటున్నారు. ఈ ఆకులని మెత్తగా నూరి వాటిని తలకు కనుక అప్లై చేస్తే మైగ్రేన్‌ సహా అన్ని రకాల తలనొప్పులూ చాలా ఈజీగా తగ్గుతాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలయిన డాక్టర్ కొనకల్ల సుధా తెలిపారు. అయితే అలాగని వీటిని అతిగా కూడా తినకూడదట.. ఇవి తినడానికి కొంచెం వగరుగా ఉన్నప్పటికీ కూడా గ్లూ బెర్రీ ఫ్రూట్స్ మనుషుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పండు అని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ గ్లూ బెర్రీ పండ్లని అడవిలో ఎలుగు బంట్లు చాలా ఇష్టంగా తింటాయట. చెట్టు కింద ఈ పండ్ల తొక్కలు పడి ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎలుగు బంటి ఉందని గిరిజనులు గుర్తిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: