చిన్న పెద్దా అని తేడా లేకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.. అయితే అందుకు కారణాలు ఏంటి అయినా కావచ్చు కానీ గుండెపోటు వచ్చే ముందు మనకు ఇలాంటి సూచన ఇస్తుందట. ఇలా ఇవ్వడం చేత ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తం కూడా కావచ్చు. వాటి గురించి చూద్దాం.


గుండె నొప్పి వచ్చే ముందు చాతిలో నొప్పిగా అనిపించడం.. లేదా చాలా అసౌకర్యంగా కూడా అనిపిస్తుందట... వీటితో పాటు శ్వాస సరిగా ఆడక పోవడం అలాగే ఎక్కువగా చెమటలు పట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఆ వ్యక్తి యొక్క ఎడమ చేయి నొప్పి కూడా చాలా పెరిగి పోతుందని నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. ఈ నొప్పికి చెయ్యి లాగుతున్నట్టుగా అనిపిస్తుందట.



అయితే మరికొందరికి అయితే రెండు చేతులు భుజాలు కూడా చాలా నొప్పిగా ఉంటాయని నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. మరి కొంత మందికి తల తిరగడం లేకపోతే అనుకోకుండా కింద పడిపోవడం వంటివి చేస్తూ ఉంటారట.


ఇంకొందరికి చాతి మధ్యలో భాగంలో ఎడమవైపుగా ఎక్కువగా నొప్పి వేయడంతో పాటు అసౌకర్యమైన ఫీలింగ్ కలిగిస్తుందట. మరి కొంత మందికి మెడ దవడ వెనక భాగంలో కూడా చాలా నొప్పిగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.


ఇలాంటి సమస్యలు ఎవరికైనా వస్తున్నట్లు కనిపించిన వెంటనే వారు వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమం.. ఎవరు కూడా ఎలాంటి నాటు వైద్యాలను సైతం ఉపయోగించుకోకుండా వైద్యులను సంప్రదించడమే ఉత్తమము..


అయితే గుండెపోటు రాకుండా ఉండాలి అంటే.. ఎక్కువగా క్రోబు ఉన్న పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది.. అలాగే ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తినడం.. కనీసం రోజుల ఒకసారి అయినా వ్యాయామం చేయడం లేదా వాకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉండాలి. ఎక్కువగా ఆకుకూరలు తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: