ఎంతోమంది కావాల్సిన వాళ్ళకి మాత్రమే కాదు.. తెలియని వాళ్ళకి కూడా రక్తదానం చేస్తూ పునర్జన్మను ప్రసాదిస్తూ ఏకంగా ఎన్నో కుటుంబాల పాలిట దేవుళ్లుగా మారిపోతున్నారు అని చెప్పాలి ఈ క్రమంలోనే కొంతమంది అయితే ప్రతి ఏడాది రెండు మూడు సార్లు రక్తదానం చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటివరకు ఇలా మనుషులు రక్తదానం చేయడం గురించి ఎన్నోసార్లు విన్నాం. వినడం ఏంటి ఎన్నోసార్లు రక్తదానం చేసిన మనుషులను కూడా చూశాము. మీరు కూడా రక్తదానం చేసే ఉంటారు. అయితే ఇక్కడ కూడా ఇలాగే రక్తదానం జరిగి ఒక ప్రాణ నిలబడింది. అయితే చేసింది మనిషి కాదు ఏకంగా కుక్క రక్తదానం చేసి ప్రాణాన్ని నిలబెట్టింది.
అదేంటి కుక్క రక్తదానం చేయడం ఏంటీ.. ఆ రక్తంతో ప్రాణం నిలబడటం ఏంటి.. కుక్క రక్తాన్ని ఎక్కడైనా మనిషికి ఎక్కిస్తారా అని ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే కుక్క రక్తదానం చేసింది మనిషి కోసం కాదు మరొక కుక్క కోసం. మనుషుల పట్ల విశ్వాసం చూపడమే కాదు సాటి కుక్కకు సాయంచేయడంలోను ముందు ఉంటానని ఒక శునకం నిరూపించింది. కర్ణాటకలోని కొప్పలలో లాబ్రడార్ జాతి కుక్క రక్తహీనతతో బాధపడుతుంది. దీనికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉండడంతో.. డాబర్మాన్ కుక్కల యజమానులను వైద్యులు సంప్రదించారు. బైరవ అనే కుక్క రక్తం సరిగ్గా సరిపోవడంతో.. దాని నుంచి 300 ml రక్తాన్ని సేకరించి ల్యాబ్రాడార్ అందించారు. దీంతో ఆ కుక్క ప్రాణాపాయం నుంచి బయటపడింది.