శ్రావణమాసం వచ్చిందంటే చాలు దేశంలో ఎక్కడ చూసిన కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు గుళ్ళు గోపురాలు అని తిరగని వాళ్ళు కూడా ఇక శ్రావణ మాసంలో భక్తులుగా మారిపోతూ ఉంటారు. ఏకంగా ప్రతిక్షణం కూడా దైవచింతనతోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఇక తమ తినే ఆహారం విషయంలో కూడా ఎన్నో కట్టుబాట్లను పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అప్పటివరకు ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న విధంగా చికెన్ మటన్ లాంటి వాటితో రోజు ఆహారాన్ని తిన్నప్పటికీ ఇక శ్రావణమాసం వచ్చిందంటే చాలు కాస్త కష్టం అనిపించినా ఇలా మాంసాహారానికి మాత్రం దూరంగానే ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక శుద్ధిగా ఉండేందుకు ఇలా మాంసాహారాన్ని దూరం పెడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే పెద్దలు ఏం చేసినా కూడా దాని వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఉంటుంది అన్నది ఇప్పటి వరకు చాలా విషయాల్లో బయటపడింది. ఇంటి ముందు కల్లాపి చల్లే దగ్గర నుంచి ఏకంగా గాయం తగిలినప్పుడు పసుపు పెట్టడం వరకు పెద్దలు చేసిన ప్రతి దాని వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఉంది అని ఇప్పటికే ఎంతమంది శాస్త్రవేత్తలు కూడా తెలిపారు.


 అయితే ఇక అందరూ ఎంతో భక్తిగా పాటించే శ్రావణమాసం విషయంలో కూడా ఇలాంటి ఒక సైంటిఫిక్ రీసన్ ఉందట.. చాలామందికి శ్రావణమాసం వెనుక ఉన్న సైంటిఫిక్ రీసన్ ఏంటి అన్న విషయం తెలియదు. శ్రావణమాసం ప్రతి ఏట వర్షాకాలంలో వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కోళ్లు ఇతర జంతువులకు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట. తద్వారా మాంసానికి దూరంగా ఉండాలని సైంటిఫిక్ రీజన్ ఉంది . అంతేకాదు ఇక వర్షాల కారణంగా సూర్య రష్మి కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఇక మనిషిలో రోగ నిరోధక శక్తితో పాటు జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా వస్తాయట. తద్వారా మాంసాహారాలు త్వరగా జీర్ణం కాక సమస్యలు తలెత్తుతాయట. అందుకే శ్రావణ మాసంలో మాంసానికి దూరంగా ఉండాలని సాంప్రదాయం ఎన్నో దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: