ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి వంటకం చేసినా కూడా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, చట్నీలు మిక్సీలో పట్టి ఆ పేస్టులను కూరలలో వేసుకుంటూ ఉంటాం. పూర్వకాలంలో అయితే వేటినైనా రోట్లో వేసి చేతితో రుబ్బేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు ఉంటున్నాయి. ఒకప్పుడు పేస్ట్ ల కోసం మాత్రమే మిక్సీలను వాడేవారు. ప్రస్తుతం కూరగాయలను కట్ చేసే మిక్సీలు కూడా వచ్చాయి. ఎంత చిన్న వస్తువులు అయినా సరే మిక్సీలో వేసి కట్ చేస్తున్నారు. 


అయితే మిక్సీలో కొన్ని ఆహార పదార్థాలను అసలు వేయకూడదట. అలా వేసినట్లయితే ప్రమాదంలో పడినట్లేనని వైద్యులు సూచనలు చేస్తున్నారు. కూరగాయలను మిక్సీలో అసలు గ్రైండ్ చేసుకోకూడదు. కూరగాయలను మిక్సీలో వేసిన సమయంలో మిక్సీ జార్ పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఇక వేడిపదార్థాలను పొరపాటున కూడా మిక్సీలో వేయకూడదు. అలా వేసినట్లయితే మిక్సీ జార్ లు కాలిపోతాయి. చల్లారిన తర్వాతనే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది జ్యూస్ లు చేసుకుంటూ ఉంటారు.


అందులో ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేస్తూ ఉంటారు. మిక్సీలో ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల బ్లేడ్లు, మిక్సీ జార్, మిక్సీలు దెబ్బతింటాయి. చాలావరకు మిక్సీ గిన్నెలలో చల్లని పదార్థాలు వేయకపోవడం మంచిది. ఇంకా చాలామంది మసాలా దినుసులను వేయించి మిక్సీలో గ్రైండ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బ్లేడ్లు పాడవుతాయట.


మసాలా దినుసులను రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. లేదా కొద్దిగా పొడిలాగా చేసిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. కొంతమంది దుంపలను కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేస్తూ ఉంటారు. అలా గ్రైండ్ చేయడం వల్ల మిక్సీ జార్ పాడవుతుంది. కాఫీ గింజలను మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయకూడదని....అలా చేయడం వల్ల కాఫీ గింజలు మిక్సీ జార్ లో ఇరుక్కుపోతాయి. దానివల్ల మిక్సీ జార్ అతితక్కువ సమయంలోనే పాడవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: