స‌హ‌జంగా ముఖంలో ముందుగా క‌ళ్లు బాగా ఆక‌ట్టుకుంటాయి. క‌ళ్లు అందంగా ఉంటే ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తాయి. అయితే కొంద‌రు ఐ సైట్‌తో బాధ‌ప‌డ‌తారు. కళ్లద్దాలు, లేదా లెన్సులు వాడ‌క‌పోతే వారికి చూపు క‌నిపించ‌దు. ఒత్తిడి, పోషకాహారలోపం ఇలా అనేక కారణాలు వల్లనే కంటి చూపు మ‌రియు కంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాం. ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలు కంప్యూటర్లు మీద లెక్కలేనన్ని గంటలుగా పనిచేయ్యాల్సి వస్తోంది. 


లెక్కలేనన్ని పనిగంటలు కంప్యూటర్ మీద చెయ్యడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి ప్రభావానికి క‌ళ్లు బాగా ఎఫెక్ట్ అవుతాయి. దీని వ‌ల్ల మ‌స‌గ్గా కనిపించడం, చూపు సరిగ్గా లేకపోవడం లేదా చూపు కనపడక పోవడం జ‌రుగుతుంటాయి. వీటికి క‌ళ్ల‌ద్దాలు లేదా లెన్సులు వాడాల్సి వ‌స్తుంది. అయితే వీటిని సులువుగా స‌హ‌జ‌సిద్ధంగా న‌యం చేసుకోవ‌చ్చు. 


అది ఎలాగా అనుకుంటున్నారా ? ఓ సారి ఇటు లుక్కేయండి.. వాల్ నట్స్(ఆర‌కేజీ), తేనె(300 గ్రా), కలబంద(100 గ్రా), నిమ్మరసం( 3 కాయ‌లు) తీసుకోవాలి. వీటిని బాగా క‌లిపి భోజ‌నం తీసుకునే ముందు తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వీటిలో ఉన్న పోష‌కాలు కంటి చూపు మెరుగుప‌డేలా చేస్తుంది. కానీ కిడ్నీ స‌మ‌స్య‌లు, గ‌ర్భిణీలు, గ్యాస్టిక్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారి దీనికి దూరంగా ఉండ‌డం మంచిది.


మ‌న నిత్య జీవితంలో కంటి చూపు చాలా అవ‌స‌రం. మ‌రియు అంద‌రూ వారి క‌ళ్లు అందంగా ఉండాల‌ని కూడా అనుకుంటారు. అయితే మ‌నం నిత్యం మనం పాటించే పలు అలవాట్ల వల్ల కూడా మన కంటి చూపు పోతుందని తెలుసుకోవాలి. పుట్టుకతో లేదా మరే ఇతర కారణం వల్లో అయితే కంటి చూపు లేక‌పోతే వేరే విషయం, కానీ ధూమపానం, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆహార అల‌వాట్ల వ‌ల్ల కూడా కంటి స‌మ‌స్య‌లు ముఖ్యంగా వ‌స్తాయి. అందుకు త‌గిన జాగ్ర‌త‌లు మ‌నం తీసుకోపోతే చాలా న‌ష్ట‌పోతాం కంటి నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: