ప్రస్తుత గడావిడి జీవితంలో క్షణం కూడా తీరిక లేకుండా పోతోంది. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల  చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు అనారోగ్యం వెంటాడుతోంది. దీని కారణంగా చాలా మంది ఎదురుకుంటున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఈ సమస్య అటు పెద్ద వాళ్ళలోనే కాక ఇటు చిన్న పిల్లలలో కూడా ఉంది.దీనికి మనం చాలా డబ్బులు కర్చుపెట్టి ఎన్నో మందులను వాడుతున్నాము కాని సమస్య మాత్రం పరిష్కారం అవ్వటం లేదు.ఈ సమస్యకు మనం ఇంట్లోనే  చక్కటి చిట్కలతో తయారు చేసుకుని పాటించవచ్చు.ఈ చిట్కాని చాలా సులువుగా మనం తయారు చేసుకోవచ్చు.దీనికి కావాల్సిన పదార్ధాలు తయారి విదానం ఎలానో చూద్దాం.


"గ్యాస్ట్రిక్ ట్రబుల్" సమస్యను నివారించడానికి కావాల్సిన పదార్ధాలు:
జీలకర్ర25 గ్రాములు,
సోంపు50 గ్రాములు,
తాటి బెల్లం100 గ్రాములు,
తయారు చేసుకునే విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక కలాయి పెట్టి జీలకర్రను, సోపును వేరు వేరుగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత రెండిటిని వేరు వేరుగా మిక్సీ పట్టుకుని జల్లించి మెత్తటి పొడిలా చేసుకోవాలి.ఇప్పుడు తాటి బెల్లంని తీసుకుని బాగా దంచి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న పొడులను ఈ తాటి బెల్లంలో బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.ఇలా చేసిన ఉండలను పొద్దునా, మధ్యానం, రాత్రి భోజనం తర్వాత బుగ్గన పేటుకుని రసాన్ని మింగుతా ఉండాలి.ఇలా క్రమం తపకుండా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపసెమనం కలుగుతుంది.

జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు:

జీలకర్ర తీసుకోటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జీలకర్ర విత్తనాలు విటమిన్ ‘E’ ని కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగానూ, ప్రకాశవంతంగాను చేస్తుంది. జీలకర్రని వాడటం వల్ల వెంట్రుకల మందాన్ని పెంచి, బట్టతలని, జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది.
సోంపు వల్ల కలిగే ప్రయోజనాలు: సోంపు తీసుకోటం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. రక్తపోటుని సాధారణంగా ఉండేలా చూస్తుంది. సోంపు లో ఇనుము బాగా లభిస్తుంది.సోంపులో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనము బరువు కూడా తగ్గుతాము.


మరింత సమాచారం తెలుసుకోండి: