విటమిన్ ఇ క్యాప్సుల్స్ లో రెండు రకాలుంటాయి. ఒకటి ఎక్కువ పవర్ ఉన్నది. రెండవది కొంచెం పవర్ తక్కువది. దీనిలో మీ సమస్యకు ఏ పవర్ సరిపోతుందో ఒకసారి డాక్టర్ సలహా అడిగి వాడితే చాలా మంచిది. సాధారణ సమస్యలకు 400 mg సరిపోతుంది. విటమిన్ ఇ క్యాప్సుల్స్ తగిన మోతాదులో వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విటమిన్ ఇ క్యాప్సుల్స్ 400 mg కంటే ఎక్కువ మోతాదుల్లో ఉపయోగించినప్పుడు వికారం, విరేచనాలు, కడుపు తిమ్మిరి, అలసట, మైకం, దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనబడతాయి.


అప్పుడప్పుడు తలనొప్పి అనేది కూడా వస్తుంటుంది. తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమైనా ఉంటే మాత్రం వైద్యున్ని సంప్రదించటం చాలా మంచిది. అయితే విటమిన్ ఇ సహజసిద్ధంగా మన శరీరానికి అందాలంటే ఆకుపచ్చని ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, పొద్దు తిరుగుడు నూనె, ఆలివ్ ఆయిల్, బ్రోకలీ, మాంసాహారం ,గుడ్లు, చేపలు, మామిడి పండ్లు వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. ఈ ఆహారం తరచుగా తీసుకుంటూ ఉంటే సహజసిద్ధంగా విటమిన్ ఇ మన శరీరానికి అందుతుంది.


చూశారుగా విటమిన్ ఇ క్యాప్సుల్స్ లో ఉన్న తేడాలు. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు, సౌందర్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్ వీటిని ఏ మోతాదు లో వాడాలో అంతే మోతాదు లో వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాల్ని పొందుతారని ఆశిస్తున్నాం. విటమిన్ ఇ శరీరానికి ఎంత అవసరమో మన చర్మానికి కూడా అంతే అవసరం. చర్మ సంరక్షణలో, జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయం చేస్తుంది. ఆలస్యం ఎందుకు మీరు కూడా సరైన డాక్టర్ సలహాతో విటమిన్ ఇ క్యాప్సుల్స్ ని వాడి వీటి యొక్క ప్రయోజనాల్ని వెంటనే పొందేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: