చెరకు రసం పోషక మయం అని చెప్ప‌వ‌చ్చు. వాస్త‌వానికి ఏ రసమైనా ఇంట్లో తయారుచేసుకోగలం. కానీ.. ఒక్క చెరకు రసం తప్ప. దీన్ని తాగాలంటే చెరకు బండి దగ్గరికి వెళ్లాల్సిందే. కానీ రోడ్డు మీద అమ్మే చెరకు రసమా అని దీన్ని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ రసంతో ఆరోగ్యానికి ఒరిగే లాభాలు లెక్కలేనన్ని. చెర‌కు ర‌సం వ‌ల్ల శరీరంలోని చెడు కొవ్వుల నిల్వలు దూరమవుతాయి. శరీరానికి సహజ చక్కెర్లు అందుతాయి.


ఈ రసం జీవక్రియ రేటుని వృద్ధిచేస్తుంది. నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.  చెర‌కులో సింపుల్‌ షుగర్స్‌ ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ నిక్షేపంగా చెరకు రసం తాగేయొచ్చు. అలాగే దీన్లోని పొటాషియం, ప్రొటీన్‌, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు ఇతర పోషకాలు ఎండ వల్ల కోల్పోయిన లవణాలను భర్తీ చేసి తక్షణ శక్తినిస్తాయి. చెరకు రసానికి లాక్సేటివ్‌ గుణాలుంటాయి.


కాబట్టి మలబద్ధకం వదలాలంటే చెరకురసం తాగాలి. చెరుకు రసం  జుట్టుకు కూడా మంచిది. ఇది మీ జుట్టు యొక్క సరైన పెరుగుదలలో సహాయపడుతుంది మరియు హెయిర్ ఫాల్‌ని నిరోధిస్తుంది. చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధి తగ్గించటంలో చెరకురసం మహత్తరంగా పని చేస్తుంది.


మూత్రసంబంధ సమస్యలను తొల‌గిస్తుంది. విసర్జక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. గర్భిణులకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: