తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో  మెడికల్ మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. వైద్యులు,  మెడికల్ షాప్ యాజమాన్యాలు కలిసి వాటాలు వేసుకొని మరి దోచేస్తు న్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఎంపిలకు పీఆర్వోలకు 40%  మిగతా 60%  హాస్పిటల్ కు చొప్పున పంపకాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జిల్లాలో రోజుకు దాదాపు  వేలల్లో అవుట్ పేషేంట్ విభాగంలో వైద్య సేవలను పొందుతున్నారు. అయితే  వైద్యులు మాత్రం మీ రోగమే మా భాగ్యమన్న ధోరణిలో ఉన్నారన్న విమర్శ వ్యక్తమవుతోంది. పేదల ఆరోగ్యంపై పైసలు దోచుకుంటున్న దగా కోరులని మండిపడుతున్నారు. చేతికి వేసుకునే ఒక్కో సూది  8 రూపాయల నుంచి 102 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. డెంగ్యూ  రూ. 40 లకు చేయాల్సిన  ఇంజక్షన్ ను  రూ. 405 ల చొప్పున అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పేదల నుంచి వేలల్లో వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. నల్గొండ  జిల్లాలోని డెంగ్యూ, చికెన్ గున్య  బాధ్యతలను ప్లేట్లెట్ ల పేరుతో మరింత దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. ఒకప్పుడు గ్రామ దేవుళ్లుగా ఉన్న ఆర్ ఎంపిలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారారన్న ఆరోపణను వినవస్తున్నాయి. వాస్తవానికి  ఆర్ ఎంపిల ముసుగులో ప్లేట్లెట్ మాఫియా జరుగుందని ఆవేదన వ్యక్తమవుతోంది. అవసరం లేకున్నా సరే అన్ని రకాల టెస్టులు చేపించాల్సిందే అదే మా హాస్పిటల్ రూల్ అంటున్న వైనం. అసలు ధరల కన్నా 10 రేట్లు ఎక్కువగా మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. 



ఆస్పత్రులు,డయాగ్నిస్టిక్ సెంటర్లు,మెడికల్ స్టోర్స్ పేదోడి జేబులు లూటీ చేస్తుమాయని వాపోతున్నారు. ఒక్కో పేషంట్ కు 5 నిమిషాలు కేటాయిస్తే అది బెస్ట్ ట్రీట్మెంట్ అంట. ఒక్కో బెడ్డు కు రోజుకి 5 వేల రూపాయలు వసూళ్లు మందులతో కలిపి రోజుకు 10వేల రూపాయలు వరకు బిల్లు ఈ విధంగా నిరుపేదలను అడ్డంగా దోపిడీ చేస్తున్నారు. కేవలం చిన్న చిన్న జ్వరాలుకు కూడా 30-40 వేల రూపాయల వరకు బిల్లు కట్టాలంటే పేదోళ్ళు ఇంకెలా బ్రతకాలని వాపోతున్నారు. నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఇదే తంతు కొనసాగుతున్నతుందన్న ఆరోపణలు ఉన్నాయి. రోగులను టెస్టులు చేసి ఒకటి రొండ్రోజులు ఉంచుకోవడం ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించడం జరుగుతున్న వైనం. నల్గొండ  ఒక ప్రైవేట్ ధవఖానలో ఇటీవల ఒక కుటుంబం డెంగ్యూ బారిన పడితే తప్పుడు  రిపోర్ట్స్ ఇచ్చారు. ప్లేట్ లెట్లు  బోగసు పేరా ఎక్కించి డబ్బు లు దండుకొని సీరియస్ అని బయటికి పంపించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ పి హెచ్ సికి వెళ్లినా సరే మందులు,కనీస సౌకర్యాలు లేవు.





డి హెచ్ అండ్ హెచ్ ఓ  క్రిందనే అన్ని ప్రయివేటు హాస్పిటల్స్ ఉంటాయన్న విమర్శ ఉంది .అన్ని రకాల టెస్ట్లు రేట్లు మెడికల్ చార్జీల రేట్లు నోటీస్ బోర్డుల్లో పెట్టాల్సిన, రోగులకు తెలియపర్చాల్సిన బాధ్యత ప్రయివేటు హాస్పిటల్స్ పై ఉంది.  కాని ఒక్కరు కూడా అనుసరించరన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ప్లేట్లెట్స్ ఎక్కించడానికి అయ్యే ఖర్చురూ.1000 లు. కానీ రూ.18000 వరకూ తీసుకుంటున్నారు...రక్త కణాలు విడగొట్టినందుకు రూ.  5000 లు  కణాలను ఎక్కిచ్చినందుకు రూ.13000 వరకు తీసుకుంటున్నారు..అసలు విషయం ఏమిటంటే కొన్ని రకాల ప్రయివేట్ హాస్పిటల్స్ వైద్యులు యాంటీబయోటిక్స్ ద్వారా ఉన్న ప్లేట్లెట్సను తగ్గించి త్వరగా మీకు ప్లేట్లెట్స్ అవసరం ఉందని రోగులను భయబ్రాంతులకు గురిచేసి రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు.  మెడికల్ ల్యాబ్ టేక్నిషియన్స్ రోజుకు 2 నుంచి 3 వేలు వరకు సంపాదన ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉన్నా సరే తగ్గించి రిపోర్ట్స్ రాసి డాక్టర్ వద్దకు పంపినందుకు ప్రత్యేకంగా కమిషన్లు అందుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: