సాధార‌ణంగా వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే మారుతుంది. ఆహారం విషయంలో ఎంత మితం పాటించినా పొట్ట దగ్గర మాత్రం కొవ్వు పెరుగుతూ ఉంటుంది కొందరికి. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతోందంటే తేలిగ్గా తీసుకోకూడదు. వాస్త‌వానికి శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా అందుకు కారణాలు అంటున్నారు నిపుణులు.


దీనివల్ల టైప్ 2 మధుమేహంతో పాటూ గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. ముందుగా మనం తీసుకునే కొవ్వుల్లో మార్పు చేసుకోవాలి.  బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం.


అలాగే బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరము. లావు తగ్గాలన్నా, పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి. ఆ తినే ఆహారము విషయములో జాగ్రత్తపడాలి. ఎవరైతే తక్కువ ఉప్పు తింటారొ వారు లావెక్కరు. ఉప్పుకు శరీరములో నీటిని, కొవ్వును నిల్వ‌ చేసే గుణము ఉన్నది. ఫలితముగా బరువు పెరుగుతారు. నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి . నీరు తాగడము వల్ల‌ ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: