ఈ కాలంలో ఏదిపడితే అది తినడం అలవాటైంది.అందువల్ల లేనిపోని రోగాల బారిన పడుతున్నారు.సరైన ఆహరాన్ని సరైన సమయంలో తీసుకుంటే ఏ ఇబ్బంది వుండదని ఒక్కోక్కరి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని.వారివారి ఆరోగ్యాన్నిబట్టి వారు తీసుకునే ఆహారం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, ముఖ్యంగా మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు.ఇక రక్తంలోనూ వివిధ ర‌కాల గ్రూపులు ఉన్నాయి.కొంద‌రి బ్ల‌డ్ గ్రూపులు అరుదుగా దొరికితే,కొందరివి సాధార‌ణ బ్ల‌డ్ గ్రూప్‌లు అయి ఉంటాయి.రక్తంలో ఉండే గ్రూపులను బట్టి,వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు వైద్య నిపుణులు.ఒక సారి అవేంటో మనం చూద్దాం పదండి.



‘ఏ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు.దాంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది.ఇలాంటి వారు నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తినాలి. ‘ఏ’ గ్రూప్‌ వారు నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండటం దాదాపు మంచిది.ఇక బరువు తగ్గాలంటే పండ్లు,ఆకుకూరలు,కూరగాయలు,బీన్స్‌,గింజలు, చిరుధాన్యాలు,చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
‘బీ’ గ్రూప్‌ రక్తం ఉన్నవారు ఆకుకూరలు,గుడ్లు, తక్కువ కొలెస్ట్రాల్‌ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.కార్న్‌,టమాటాలు,గింజలు,నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి.‘బి’ గ్రూప్‌ వాళ్లకు సహజంగా జీవక్రియ తక్కువగా ఉంటుంది.త్వరగా అలసిపోతారు,ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల కనిపిస్తుంది.కాబట్టి సమయానికి భోజనం చేయాలి.ఈ గ్రూపు రక్తం ఉన్నవారి శరీరంలో కార్టిసాల్ హార్మోన్లు విడుదలవుతుంటాయి.ఫలితంగా వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు.ఇలాంటి వారు కొవ్వు,నూనె పదార్థాలు,ఆల్కాహాల్‌ను వాడక పోవడం మంచిది.



‘ఏబీ’ గ్రూప్‌.వీరి జీర్ణాశయంలో ఆమ్ల రసాలు తక్కువగా ఉంటాయి.కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్,మునగ,తేనెను ఎక్కువగా తీసుకోవాలి.ఆకుకూరలు,చేపలు,పాలు వంటివి ఆహారంతో పాటు చేర్చుకోవాలి.
‘ఓ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలు ఎదురవుతాయి.వీరు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది.వాటిలో చేపలు,మాంసం,కూరగాయలు, గింజలు, బీన్స్‌, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.చూసారుగా కాస్త ఆలోచించి తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: