గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో హీరోలు మొహం నిండ గడ్డంతో కనబడుతున్నారు.తమ అభిమాన హీరో గడ్డంతో కనబడితే యూత్ ఊరుకుంటారా వారు కూడా గడ్డం పెంచుతున్నారు. గడ్డం వల్ల మగవాళ్ళు చాలా హాట్ గా కనబడతారు. అయితే రీసెంట్ గా జరిపిన సర్వే లో గడ్డం పెంచడం వల్ల చాలా ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయని తెలిసింది.
1) మొహంపై ఎండ ఎక్కువగా పడటం వల్ల చర్మం గట్టిపడుతుంది మరియు  చర్మంపై ముడతలు తోందరగా వచ్చే అవకాశం ఉంది. మగవాళ్ళు ఫుల్ గా గడ్డం పెంచడం వల్ల మొహనికి ఎండ నుండి రక్షణ లభిస్తుంది మరియు స్కీన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
2) గడ్డం ఉంచుకోవడం వల్ల మన చర్మం పైన సహజంగా ఉండే  మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది
3)గడ్డం ఫుల్ గా ఉంటే హానికరమైన బ్యాక్టిరియ మరియు దుమ్ము నోటి ద్వారా లోనికి ప్రవేశించదు కావున గొంతు నోప్పి గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు.
4)అస్థమా ఉన్న వారికి  గడ్డం దుమ్ము లోపలికి వెళ్లకుండా అడ్డుపడుతుంది .
5)1972 లో చేసిన ఒక స్టడీ ప్రకారం  మగవాళ్ళు తమ  జీవిత కాలంలో  3,350 గంటలు షేవింగ్ చేసుకుంటారట . అంటే దాదాపు గా 139 రోజులు, ఐదు నెలలు. అంటే గడ్డం పెంచడం వల్ల  అంతా సమయాన్ని ఆదా చేయవచ్చు. ఈ సమయాన్ని మీకు ఇష్టం వచ్చిన పని కోసం వాడవచ్చు.
6)శీతాకాలంలో గడ్డం మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. మరియు  శీతాకాలంలో  చర్మం పగులుతుంది   గడ్డం  ఫుల్ గా పెంచడం వల్ల చర్మానికి రక్షణ కలుగుతుంది.
.
 సలహలు:
గడ్డం పెంచాలని అనుకునే వారికి ముందుగా సహనం ఉండాలి. గడ్డం పూర్తిగా రావడానికి కనీసం ఒక నెల పడుతుంది.రోజు ఉదయం సాయంత్రం రెండు సార్లు వేడి వాటర్ తో  కడగటం వల్ల చర్మం పైన ఉండే మురికి పోతుంది ,మరియు  శ్లేష రంధ్రాలు తెరుచుకోవడం వల్ల గడ్డం తోందరగా పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: