విక్స్‌ అనే పేరు దాదాపుగా తెలియని వారుండరు.ముఖ్యంగా చిన్నపిల్లలు జలుబు,దగ్గుతో బాధపడుతున్నప్పుడు దీన్ని వాళ్లకు ఊపయోగిస్తారు.ఇక సైన్స్ ఎంతగా అభివృద్ది చెందినా ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి.మనిషికి సంభవించే దాదాపు అన్ని వ్యాధులకు మందులు కనుగొన్నా ప్రతి ఒక్కరిని వేధించే జలుబుకి ప్రత్యేకం గా చికిత్స అంటూ నేటివరకు సాధ్యం కాలేదు.వాతావరణంలో మార్పు చోటుచేసుకొన్నప్పుడల్లా ముక్కు మొరాయిస్తుంది.పడిశం పట్టి పీడిస్తుంది. జలుబు చేస్తున్నట్టు అనీ అనిపించగానే తుమ్ములు,ముక్కునుంచి నీళ్లు కారడం లాంటివి బయటపడతాయ.అందుకే పడిశం పదిరోగాలపెట్టు అంటారు.పడిశం చేయగానే తలనుంచి పాదందాకా అన్ని అవయాలు నొప్పి అనిపిస్తాయ.గాలి ఆడకుండా ముక్కు దిబ్బడిగా ఉంటుంది.ఇది చిన్న పిల్లల్లో మరింతగా ఇబ్బందిని కలిగిస్తుంది.ఇక త‌ల‌నొప్పి,ద‌గ్గు,ముక్కు దిబ్బ‌డ వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నివారిణిగా విక్స్‌ను చెబుతారు..అంతేకాకుండా విక్స్‌ను కేవ‌లం పైన చెప్పిన స‌మ‌స్య‌ల‌కే కాదు,ఇంకా ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు.ఆ ఉప‌యోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.



వెల్లుల్లి రేకుల‌పై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వ‌ద్ద పెట్టుకుని గ‌ట్టిగా శ్వాస పీల్చాలి.దీంతో సైన‌స్ త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. ఇక దోమలు కుట్టకుండ వుండాలంటే కొద్దిగా విక్స్‌ను తీసుకుని దానికి కొంత వేజ‌లిన్ క‌లిపి చ‌ర్మానికి లేదంటే బ‌ట్ట‌ల‌కు రాసుకుంటే దోమ‌లు కుట్ట‌వు.ఇక రోజుకు క‌నీసం 3 సార్లు విక్స్‌ను మొటిమ‌ల‌పై క్ర‌మం త‌ప్ప‌కుండా రాస్తుంటే మొటిమ‌లు త‌గ్గిపోతాయి.కొద్దిగా విక్స్‌ను తీసుకుని చెవుల వెనుక‌,మోచేతుల‌పై,మెడ‌పై,మోకాళ్ల‌పై రాసుకుంటే కీట‌కాలు, పురుగులు,ఈగ‌లు వాల‌వు.విక్స్ డ‌బ్బాను ఓపెన్ చేసి ఆహార ప‌దార్థాల‌కు స‌మీపంలో ఉంచితే అక్క‌డ ఈగ‌లు వాల‌వు.ఇక గాయం అయిన చోట విక్స్ రాస్తే త్వ‌ర‌గా ఆ గాయం త‌గ్గిపోతుంది.శ‌రీరంలో కండ‌రాలు నొప్పులు ఉంటే ఆ ప్ర‌దేశాల్లో విక్స్‌ను రాసి బాగా మ‌ర్ద‌నా చేసిన,అనంత‌రం ట‌వ‌ల్‌తో గట్టిగా చుట్టాలి.దీంతో కండ‌రాల నొప్పులు త‌గ్గిపోతాయి.చ‌ర్మం త‌డి ఆరిపోయి పొడిగా మారి ఇబ్బందులు పెడుతుంటే విక్స్ రాయాలి.దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది.



విక్స్‌,మెంథాల్‌,క‌ర్పూరంను బాగా క‌లిపి మోచేతిపై పెట్టుకుంటే టెన్నిస్ఎల్బో స‌మ‌స్య ఉండ‌దు.రాత్రి పూటపాదాల‌కు విక్స్‌ను  రాసి సాక్స్‌లు వేసుకోవాలి.ఉద‌యాన్నే సాక్సుల‌ను తీసి వేడి నీటితో కాళ్ల‌ను క‌డ‌గాలి.దీంతో పాదాల ప‌గుళ్లు పోతాయి. కాలి వేళ్ల‌కు ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే ఆ ప్ర‌దేశంలో విక్స్ రాయాలి.త‌ర‌చూ ఇలా చేస్తుంటే ఇన్‌ఫెక్ష‌న్ తగ్గి పోతుంది.గొంతు లేదా ఛాతిపై కొద్దిగా విక్స్ రాసి మ‌ర్ద‌నా చేస్తే ముక్కు దిబ్బ‌డ‌,ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.చ‌ర్మం
సాగిపోయిన‌ట్టుగా మార్క్‌లు ఏర్ప‌డితే ఆయా ప్ర‌దేశాల్లో విక్స్ రాయాలి.2 వారాల పాటు ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోతాయి. చ‌ర్మంపై దుర‌ద‌లు వ‌స్తుంటే విక్స్ రాయాలి.దీంతో ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.కొద్దిగా కాట‌న్ తీసుకుని దానికి విక్స్ రాసి చెవిలో పెట్టుకుంటే చెవినొప్పి త‌గ్గిపోతుంది.ఇవన్ని చాలజాగ్రత్తగా చేయాలి అప్పుడే ఫలితం వస్తుందంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: