అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇంట్లో లేక పోవడం వల్లనే సమాజం రుగ్మతలకు గురవుతుందన్న అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యక్తం చేశారు.  హైదరాబాద్ లోని కెబిఆర్ పార్క్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన అల్జీమర్స్ అవగాహన వాక్ ను మంత్రి ఈటెల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్లాగ్ ఆఫ్ చేసి వాక్ నీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ వాక్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు  మంత్రి ఈటెల అభినందనలుతెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ..సమాజం పోకడ మారిందన్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న మైక్రో కుటుంబాలుగా మారిపోయాయి అని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంట్లో తాతయ్య నాయనమ్మ లేకపోవడంతోనే సమాజంలో ఇలాంటి రుగ్మతలు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో అరాచక భావాలు రాకుండా ఇంట్లో ఉన్న పెద్దవారు చెప్పేవారని చెప్పారు. అంతే కాకుండా సమాజంలో ఎలా మసలుకోవాలి, పెద్ద వారిని ఎలా గౌరవించాలి, ఆత్మీయులను ఎలా ప్రేమించాలి అనే అంశాలపై మార్గ దర్శకాలు చేసేవారని గుర్తు చేశారు. ఈ సందర్బంగా మంత్రి తన చిన్న నటి సంగతులను గుర్తు చేసుకున్నారు.




ఆనాటి  నానమ్మకు ఇంగ్లీషు చదవడం చాలా కష్టంగా ఉన్నా ఆమె ఇంగ్లీషులోని కావలికోట పత్రికకు చందా కట్టిందన్నారు. వయస్సు మళ్లిన ఒక వ్యక్తి అక్కడ ఉండడం నేను చూసి, ఆయన వెళ్లిపోయిన తర్వాత, ఆయన ఎవరని మా అమ్మమ్మను అడిగానని చెప్పారు. ప్రస్తుతం అలాంటి సంఘటనలకు తావులేకుండా పోయిందన్నారు.  ఇప్పుడు మంచి విషయాలు చెప్పే పెద్ద వారు కుటుంబంలో  లేకపోవడం పోయారని అన్నారు. దానికి తోడు తల్లిదండ్రులు బిజీగా ఉండటంతో పిల్లల్లో అనేక చెడు అలవాట్లను చూస్తున్నామని చెప్పారు. చిన్నపిల్లల నేరాలకు ఘోరాలకు పాల్పడటం కనిపిస్తుందన్నారు. వీటన్నింటికీ పరిష్కారం కుటుంబం నుంచే రావాలి అప్పుడే సమాజం బాగుంటుందని మంత్రి ఈటెల అభిప్రాయపడ్డారు. మతిమరుపు జబ్బుకి చికిత్స లేదని, దని నివారణకు సహకారం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. కానీ మతిమరుపు వచ్చిన పెద్దలను అంటిపెట్టుకుని ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు.





అలాంటి వారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే మతిమరుపు నుంచి దూరమవుతారు లేదంటే ఒంటరితనం ఆ జబ్బును మరింత ఎక్కువ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు.  ఈ వ్యాధికి కూడా చికిత్స వస్తే వాటిని ప్రభుత్వపరంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో అవగాహన కల్పించేందుకు రెడ్ క్రాస్ నిర్వాహకులు ముందుకు వస్తున్నారని చెప్పారు. అటువంటి వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం  సిద్ధంగా ఉందన్నారు. చాలా జబ్బులు అవగాహనతోనే దూరమవుతాయని స్పష్టం చేశారు. చికిత్స కంటే నివారణ ముఖ్యం అనేది తెలంగాణ ప్రభుత్వ భావన అని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: