తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ఫోర్టిఫికేషన్ (ఆహార బలవర్ధీకరణ) కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖకు గైన్ సహకారంతో కర్ణాటక హెల్త్ ప్రమోషన్ ట్రస్ట్ (కెహెచ్ పిటి ) టెక్నికల్ సపోర్ట్ యూనిట్ గా పనిచేస్తుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఫుడ్ ఫోర్టిఫికేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల కమీషనర్ అకున్ సబర్వాల్, విద్యాశాఖ కమీషనర్ విజయ్ కుమార్, మహిళ, శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి, తెలంగాణ ఎస్.సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, బిసి సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి మల్లయ్య బట్టు, న్యూట్రీషన్ కన్సల్టెంట్  జానకి శ్రీనాథ్, కర్ణాటక హెల్త్ ప్రమోషన్ ట్రస్ట్(కెహెచ్ పిటి) మేనేజింగ్ ట్రస్టీ గురురాజ్ పాటిల్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవుడ్ న్యూట్రేషన్ గైన్ ప్రతినిధి సౌమ్య మిశ్రా తదితరులు పాల్గొన్నారు.



ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ కెహెచ్ పిటి సహకారంతో తెలంగాణ రాష్ట్ర పౌరులకు, భవిష్యత్ తరాలకు బలవర్ధక ఆహారం అందించేందుకు అథారిటిని ఏర్పాటు చేసే విషయమై నివేధిక రూపొందించాలని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా రైస్ ఫోర్టిఫికేషన్ కార్యకలాపాలు చేపట్టాలని, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో పండిన బియ్యాన్ని ఫోర్టిఫై చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.  పౌరసరఫరాల శాఖ కమీషనర్, విద్యాలయాల సంస్ధలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫోర్టిఫికేషన్ వలన కలిగే లాభాలపై ప్రచారం, అడ్వొకేసీ అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు.




జయశంకర్  విశ్వవిద్యాలయాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఇంపాక్ట్ ఎవాల్యూయేషన్, ఎఫికేసీ అసెస్మెంట్ కు  సంబంధించి సహకారం అందివ్వాలని అన్నారు. పాలు బియ్యం, నూనెలను తక్కువ ఖర్చుతో న్యూట్రియన్స్ ను అందివ్వవచ్చని నిపుణులు తెలిపారు. ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్ అథారిటి ఆఫ్ ఇండియా ఫుడ్ ఫోర్టిఫికేషన్ కు సంబంధించి రెగ్యులేషన్ లను జారీ చేసిందని తెలిపారు.  పాలు, బియ్యం, నూనె, గోదుమ పిండి ల ఫోర్టిఫికేషన్లో విజన్ చార్ట్ ను రూపొందించాలన్నారు. ఆహార బలవర్ధీకరణకు అవసరమయ్యే వ్యయాన్ని కూడా సమీక్షించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: