ఈ మధ్యకాలంలో మాంసం ప్రియులు చాలా ఎక్కువ అయిపోయారు. ఒకప్పుడు ఆకుకూరలకు,  కూరగాయల కు ఎక్కువ ప్రాధాన్యతను  ఇస్తే... ఇప్పుడు మాత్రం ముక్క లేనిదే ముద్ద  దిగడం లేదు ఎవరికి. ఈ నేపథ్యంలోనే మటన్ చికెన్ రేట్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. బిర్యానీ,  ఫ్రై లు,  ఇలా వివిధ రకాలుగా దొరికే మాంసాన్ని విచ్చలవిడిగా తినేస్తుంటారు ప్రజలు. అయితే మాంసం ఎక్కువ తినడం వల్ల ఏమైనా అనర్ధాలు ఉన్నాయా లేదా అనేది చాలా కొంతమందికే తెలుసు. అందుకే కొంతమంది మాంసం తినే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకొందరు ఫుల్లుగా కుమ్మి  ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అయితే మాంసం తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఎవరికైనా తెలుసా..? అవును నిజంగానే మాంసం అధికంగా  తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 

 

 

 క్యాన్సర్లలో  చాలా రకాలున్నాయి అయితే మాంసం ఎక్కువగా తినడం వల్ల వచ్చే క్యాన్సర్ పేరు పెద్ద ప్రేగు క్యాన్సర్... శాస్త్రీయ భాషలో చెప్పాలంటే కోలో రెక్టల్ క్యాన్సర్ లేదా బోర్వెల్ క్యాన్సర్. జంతు మాంసం ఎంత ఎక్కువగా తింటే  క్యాన్సర్ అంత త్వరగా వస్తుంది. రోజుకి 50 గ్రాములను కంటే ఎక్కువ తింటే ప్రమాదమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం తేలింది. వారానికి 350 గ్రాముల మాంసం మాత్రమే తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా ఫ్రై చేసిన మాంసం హోటల్ లో మసాలా దట్టించిన  మాంసం , నిల్వ ఉన్న మాంసం తినకూడదని ఇంట్లో వండుకుని తింటేనే మేలు  అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు . ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం రోజు మనం తీసుకునే ఆహారంలో  ఫ్రై లు,  ఆయిల్ ఫుడ్స్,  స్పైసీ అధిక  మొత్తంలో తీసుకోవడం వల్లే ఈ క్యాన్సర్ వ్యాపిస్తుదట  . అయితే  క్యాన్సర్ బారిన పడిన  పెద్ద ప్రేగు కదలికలలో  మార్పులు వస్తాయి. ఈ మేరకు మూత్రంలో రక్తం రావడం,  నీరసం రావడం,  బరువు తగ్గడం లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.కాగా  ఈ క్యాన్సర్ను నయం చేయడానికి రేడియోథెరపి,  కీమోథెరపి లాంటి చికిత్సల ఉన్నప్పటికీ... క్యాన్సర్ తొలిదశలో ఉన్నప్పుడు మాత్రమే వీటి ద్వారా నయం చేయడానికి వీలు ఉంటుంది. క్యాన్సర్ ముదిరితే డాక్టర్లు కూడా చేతులెత్తేయ్యాల్సిందే . అందుకే తగు జాగ్రత్తలు తీసుకొని మాంసాన్ని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: