మనం ఏ స్వీట్ చేసుకున్న.. ఏ మసాలా కూర చేసుకున్న కూడా ఇది లేకుండా మాత్రం పనవ్వదు.. ఇంతకీ ఏంటనుకుంటున్నారా.. అదేనండి యలాచి.. మసాలాలు రారాజు ఈ యలాచి.. కేవలం ఫుడ్ విషయంలోనే కాదు.. ఆరోగ్యం విషయంలో కూడా ముందుంటుంది. ఈ యలాషిని ఉపయోగించి ఎలా కరోగ్యాన్ని కాపాడుకోవచునో ఇప్పుడు చూద్దాము.. 


ముఖ్యంగా ఈ యాలుకలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయట కడుపులో మంట, నొప్పి ఏమున్నా నయం చేస్తాయి. అంతేకాకుండా మనం డిప్రెషన్ లో ఉన్నా మంచి యాలుకలు టీ, కానీ పాలు గాని తాగితే ఉపశమనం కలుగుతుందట.


నరాలు బలహీనతలు ఉన్నవారు, లైంగిక సామర్ధ్యం తక్కువ ఉన్నవారు రోజు యాలకుల పొడి తీసుకుంటే చాల మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో అందరికి సాధారణంగా వచ్చే బీపీని తగ్గించేందుకు కూడా యాలకులు బాగా పనిచేస్తాయి. అందుకే మీరు ఇంట్లో చేసుకునే వంటలలో ఎక్కువగ దీన్ని ఉపయోగించడం మంచిది. ఇంకా ఈ

యాలకలు బ్లడ్ ప్రెజర్ ను కూడా కంట్రోల్ ఉంచుతాయి.సంతానం లేని వారికి ఈ యాలుకలు తరచు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఈ యాలుకలులో ఉండే సినియోల్ పురుషులు నరాలు పటిష్ఠతకు బాగా ఉపయోగపడుతుంది.యాలకుల్లో ఎక్కువగా మాంగనీస్ ఉండడం వలన డయాబెటిస్ రిస్క్ నుంచీ అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తరచూ ఈ యాలకులు తీసుకోవడం మంచిది.


ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది క్యాన్సర్ వంటి పెద్ద జబ్బుల భారిన పడుతుంటారు. అలాంటి వ్యాధులను నయం చేయడంలో ఈ యలాచి చాలా మేలు చేస్తుంది. 
అంతేకాదండోయి ఈ యాలకులలో యాంటీయాక్సిడెంట్లు మెండుగా ఉండటం వల్ల గుండె సంబంధిత జబ్బులు దరిచేరవని నిపుణులు అంటున్నారు. 
 ఇన్ని ఉపయోగాలున్న యలాచిని తినడంలో కొంచం శాతం పెంచండి.. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: