సాధార‌ణంగా ప్ర‌స్తుత కాలంలో చాలామంది అధిక బ‌రువు ప‌ట్ల శ్రద్ధ చూపితున్నారు. ఈ క్ర‌మంలోనే బరువు తగ్గడం కోసం రోజూ జిమ్‌కు వెళ్ల‌డం, వ్యాయామం,ఆహార, జీవ‌న విధానాల‌ను మార్చుకోవ‌డం, స‌రైన పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అలాగే రాత్రి అన్నం బ‌దులు చ‌పాతీలు తింటుంటారు. అయితే పాతీల‌ను తిన‌డం వ‌ల్ల రుచికి రుచే కాదు, పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.


అయితే రాత్రిళ్లు మనం చేసే పని ఏమీ ఉండదు. ఈ క్ర‌మంలోనే డాక్టర్లు ఈ మధ్య నైట్‌ చపాతీలు తినమని సూచన చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. చపాతీ తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలూ ఉండవు. గోధుమల్లో ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. వాటిల్లో ఎక్కువగా విటమిన్‌- బి, ఇ, కాపర్‌, అయోడిన్‌, జింక్‌, మాంగనీస్‌, సిలికాన్‌, మెగ్నీషియం, క్యాల్షియం, వంటి ఎన్నో ఖనిజాలు మెండుగా ఉన్నాయి.


చాలామంది పని ఒత్తిడితో ఏ అర్ధరాత్రో భోజనం చేసి, వెంటనే కునుకు తీస్తుంటారు.తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. అందుకే భోజనం చెయ్యడానికి, నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉండాలి. అదే విధంగా క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే ఔష‌ధ‌ గుణాలు గోధుమ‌ల్లో ఉంటాయి. క‌నుక వాటితో త‌యారు చేసిన చ‌పాతీల‌ను తింటే ఆ లాభాన్ని పొంద‌వ‌చ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: