పాలు.. నిత్యం ఈ ద్రవపదార్థం లేకుండా మన ఇళ్లలో ఏ పనులు కావు. పిల్లలకు బలం కోసం.. పెద్దలకు టీ, కాఫీల కోసం ఈ పాలు తప్పనిసరి. కానీ అంతా వాడేది ఇప్పుడు ప్యాకెట్ పాలే ఎక్కువ. అయితే తెలుగు రాష్ట్రాల్లో పాల ఉత్పత్తికి కనీసం మూడు రెట్లు పాల వినియోగం ఉందట. మరి ఇది ఎలా సాధ్యం..


అందుకే కల్తీ లేకుండా డిమాండ్ ను తట్టుకునేందుకు పాల ఉత్పత్తి కష్టం అంటున్నారు. అందుకే పాల పరిశ్రమలు ఇలాంటి కల్తీలకు పాల్పడకుండా పాలు తయారు చేసే అవకాశమే లేదంటున్నారు. ఇప్పుడు ఆధునిక యుగంలో అన్నీ ప్యాకెట్లలోనే.. చివరకు పాలు కూడా..


కొన్ని రసాయనాలు, యూరియా కలిపి కృత్రిమ పాలు తయారు చేసే దుర్మార్గుల బండారం అనేక సార్లు బయటపడింది. కాకపోతే ఈ కల్తీలు చిన్న మొత్తాల్లో బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట సమీపంలో ఇటీవలి కాలంలో ఓ చిన్న పాల పరిశ్రమ నుంచి ఇలాంటి నిషేధిక రసాయనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా.


తెలుగు రాష్ట్రాల్లో ఈ డైరీ రంగం కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. అనేక ప్రముఖ కంపెనీలు ఈ రంగంలోకి వచ్చాయి. అయితే ఈ ప్యాకెట్ పాలు సురక్షితమైనవేనా అన్న అనుమానం కలుగక మానదు. కల్తీ పాల వ్యవహారం ఇదేదో చిన్న కంపెనీల పని.. పెద్ద కంపెనీల పాలు సురక్షితం అనుకోవడానికి వీలు లేదంటున్నారు వైద్య నిపుణులు. అందుకే అవకాశం ఉంటే.. గేదెలు, ఆవులు ఇచ్చిన పాలను కొనుక్కోవాలని సలహా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: