ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా షుగర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజు పెరుగుతోంది. షుగర్ బారిన పడితే షుగర్ వలన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వలన షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు పచ్చిమిర్చిని తమ డైట్ లో భాగం చేసుకుంటే మంచిది. పచ్చిమిర్చిని తింటే శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి డయాబెటిస్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. 
 
షుగర్ వ్యాధి నివారణలో మెంతులు బాగా పని చేస్తాయి. రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి మెంతిరసాన్ని ఉదయం సమయంలో పరగడుపున తాగితే మంచి ఫలితాలు వస్తాయి. కాకరకాయ రసం షుగర్ వ్యాధిని తగ్గించుకోవడంలో బాగా సహాయపడుతుంది. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని అధిక స్థాయి గ్లూకోజ్ నిల్వలను తగ్గిస్తాయి. షుగర్ వ్యాధిని తగ్గించుకోవటానికి పుల్లటి నల్ల ద్రాక్ష కూడా సహాయపడుతుంది. 
 
షుగర్ వ్యాధిని తగ్గించుకోవటానికి చపాతీ ఎంతగానో సహాయపడుతుంది. గోధుమలతో పాటు ఇతర ధాన్యాలను కూడా కలిపి తయారైన పిండితో చపాతీలను చేసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటంతో పాటు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అకుకూరలు, బీన్స్, నట్స్ కూడా షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి. పెరుగు లేదా గ్రీన్ యోగర్ట్ ను ఆహారంలో భాగంగా కలిపి తీసుకోవడం వలన శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. స్ట్రాబెర్ర్రీలను రోజూ తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు పూర్తిగా తగ్గుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: