స‌హ‌జంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 8 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే వయసుని బట్టి మనం నిద్రపోయే సమయం ఆధారపడుతుంది. రోజుకు ఎన్ని గంటలు నిద్ర కావాలనేది.. వయస్సును బట్టి మారుతుంటుంది. శిశువులు 18-20 గంటల పాటు ఖ‌చ్చితంగా నిద్రపోవాలి. స్కూలుకు వెళ్లే పిల్లలకు 9-10 గంటలు నిద్రపోవాలి. 20 ఏళ్ల దాటిన తర్వాత 8 గంటల పాటు పడుకోవాలి. వృద్ధులైతే ఆరు గంటల పాటు నిద్రపోతే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. 


ఈ లెక్కలన్నీ మనిషి రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలని చెప్పేందుకు మాత్ర‌మే. ఈ లెక్క‌లు ఇలా ఉంటే చాలామంది ఖాళీగా ఉన్నాం కదా అని ఎక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర తక్కువ కావడం వల్ల కంటే అతిగా నిద్రపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ పరిశోధన ప్రకారం రోజుకు 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవారిలో 30శాతం మంది సగటు జీవితకాలం కంటే ముందే చనిపోతున్నారని వెల్లడైంది. 


అంతేకాదు అతిగా నిద్రపోయే వారిలో 49 శాతం మందికి గుండె సంబంధి వ్యాధులు వచ్చే ప్రమాదముందని, 56 శాతం మంది గుండెపోటు వచ్చే అవకాశముందని అధ్యయనంలో తేలింది. రోజుకు 10 గంటలకు మించి నిద్రపోయే వారికి మరణించే ముప్పు 41 శాతం ఉందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు ప్ర‌తి ఒక్క‌రు నిద్ర‌పోవాల‌ని హెచ్చ‌రించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: