ఇటీవల కాలంలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి మలబద్దకం.  తీసుకునే ఆహారంలో ఫ్యాట్ అధికంగా ఉండటం వలన, ఎక్కువ నీరు తీసుకోకపోవడం వలన మలబద్దకం వస్తుంది.  
ఈ సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఫుడ్ తప్పకుండా ఉండాలి. 
 
సహజమైన కాలకృత్యాల్లో మాలవిసర్జన ఒకటి. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, 
కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. క్రమం తప్పకుండా రోజు మలవిసర్జన జరగాలి.  అలా జరగకపోతే దానిని మలబద్దకంగా భావించాలి. మలబద్దకాన్ని కారణాలు అనేకం ఉన్నాయి.  
అవేంటో ఇప్పుడు చూద్దాం. 
ఆహారంలో కార్బోహైడ్రేట్ లో ఎక్కువగా ఉండటం, శరీరంలో చెక్కర శాతం పెరగడం వలన మలబద్దకం వస్తుంది.   పెరిస్టాలిక్ కండరాలలో కదలికలు చాలా నెమ్మదిస్తాయి. 
మలపదార్థం కూడా గట్టి పడి గరుకుగా తయారవుతుంది. దీంతో మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడుతాయి.  
శరీరానికి ఆగిన వ్యాయామం లేకపోయినా మలబద్దకం వస్తుంది.  ఎక్కువ కొవ్వు ఉన్న ఆహరం తీసుకున్నప్పుడు తప్పకుండా వ్యాయామం చేయాలి.  ఇక ఇప్పుడున్న ఉద్యోగాలన్ని కూడా ఒత్తిడిని 
కలిగించేవే.  ఈ ఒత్తిడిలో పనిచేయడం వలన కూడా మలబద్దకం వస్తుంది.  ఇంకొందరు మలవిసర్జనను వాయిదా వేస్తుంటారు.  ఇది కూడా ఇబ్బంది కలిగించే అంశమే.  
ఐరన్ ఎక్కువగా ఉండే మందులు వాడటం కూడా మలబద్దకాన్ని ఒక కారణం. కొందరు పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు, అలాగే యాంటీ డిప్రెసెంట్ వంటి మందులు 
వాడటం కూడా ఇందుకు కారణం కావొచ్చు.  

ఇకపోతే, థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఐబీఎస్ సమస్య ఉన్నప్పుడు, కాలేయ సమస్యలు ఉన్నప్పుడు, పక్షవాతం లేదా నాడుల సమస్య వచ్చినపుడు, జీర్ణవ్యవస్థలో లోపాలు తలెత్తినపుడు, 
శరీరంలో అధికమొత్తంలో పరాన్న జీవులు ఉన్నప్పుడు మలబద్దకం వస్తుంది.  
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, వయసు పెరిగినపుడు లేదా ప్రయాణం చేసే సమయాల్లో కూడా మలబద్దకం సమస్య వస్తుంది.  అయితే, ఇందులో ఏది ఖచ్చితమైన కారణమో తెలిస్తే 
చికిత్స చాలా ఈజీ అవుతుంది.  మనకు ఒక సామెత ఉంది.  రోగిగా వచ్చి.. డాక్టర్ గా తిరిగి వెళ్ళండి అనే సామెత ఉంది.  రోగం ఏదో తెలిస్తే దానికి చికిత్స ఈజీ అవుతుంది కదా.  
ఇక మలబద్దకాన్ని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. 
రోజువారీ ఆహారంలో తగినన్ని పండ్లు, కూరగాయలు, గింజ ధాన్యాలు ఉండే విధంగా చూసుకోవాలి.  అలాగే తగినన్ని నీళ్లు తాగాలి.  కనీసం రోజుకు 5 లీటర్ల నీరు తాగాలి.  
ఇలా క్రమం తప్పకుండా తగినన్ని నీళ్ళు తీసుకుంటే పేగుల్లో పెరుకున్న మలం మృధువుగా మారి, ఈజీగా బయటకు వెళ్తుంది.  


అలాగే నీళ్ళు తాగిన తరువాత కాసేపు వ్యాయామం లేదా నడవడం వంటివి చేయాలి.  అలా నడవడం వలన కడుపులో కదలికలు పెరుగుతాయి.  దీంతో మలబద్దకం నుంచి బయటపడొచ్చు. 

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణమయ్యేవి, జీర్ణంకానీ పీచు పదార్థాలు నీటిని ఎక్కువగా నిల్వ చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతాయి. 
ఫలితంగా జీర్ణవ్యవస్థలోని మేలు చేసే సూక్ష్మజీవులు చురుకుగా ఉంటాయి.

కొన్ని మూలీకా ఔషధాలు, ఎనిమా, ఉపవాసం, ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారం, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, చల్లని మడ్ ప్యాక్, తొట్టి స్నానం, యోగాసనాలు, ప్రాణాయామాలు, 
దీర్ఘశంఖ ప్రక్షాలన వంటి యోగక్రియలు వంటివి ఉపయోగించి ప్రకృతి వైద్యులు చికిత్సలు చేస్తారు.  


చిన్నపాటి యోగాసనాలు చేయడం వలన కూడా మలబద్దకాన్ని నివారించవచ్చు.  ఇందులో ముఖ్యంగా పవనముక్తసనం, వజ్రాసనం వంటివి మబలబద్దకాన్ని నివారిస్తాయి.  
అంతేకాదు ప్రాణాయామంలో అనులోమ విలోమాలు, భస్త్రిక వంటివి జీర్ణక్రియను పెంచుతాయి.  అలాగే ఒత్తిడిని దూరంగా ఉంచడం వలన కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.   
ఇక త్రిఫల చూర్ణం, ఉసిరిక పొడి వంటివి కూడా బాగా పనిచేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: