మార్చి 19వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 నల్లపాటి వెంకటరామయ్య జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ అయిన నల్లపాటి వెంకటరామయ్య 1901 మార్చి 19వ తేదీన జన్మించారు. 

 

 మోహన్ బాబు  జననం : ప్రముఖ తెలుగు సినీ నటుడు నిర్మాత రాజకీయ వేత్త అయిన మోహన్ బాబు తెలుగు ప్రజలందరికీ కొసమెరుపు. మోహన్ బాబు 1952 మార్చి 19వ తేదీన జన్మించారు. ఈయన  తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ పాత్రల్లో నటించి తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం హీరో గా మాత్రమే కాకుండా  విలన్ గా  కూడా ఎన్నో పాత్రల్లో నటించారు మోహన్ బాబు. ఇక ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటించి తనకంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏకంగా  573 సినిమాల్లో నటించారు మోహన్ బాబు. 72 సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి  రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు మోహన్ బాబు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఈయన  చిత్ర పరిశ్రమలో చేసిన సేవలకు గాను 2007 సంవత్సరం లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు మోహన్ బాబు.

 

 ఇందు షాలిని జననం : ప్రముఖ భారత విద్యావేత్త అయిన ఇందు శాలిని 1954 మార్చి 19వ తేదీన జన్మించారు. 

 

 తనుశ్రీ దత్త జననం : ప్రముఖ భారతీయ సినీ నటి మరియు మోడల్ అయిన తనుశ్రీదత్తా 1984 మార్చి 19వ తేదీన జన్మించారు. ఈమె 2005 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ గెలుచుకున్నారు. 2005 సంవత్సరం లోనే బాలీవుడ్లో అడుగుపెట్టి మూడు సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది తనుశ్రీ దత్త. హిందీ లో చాలా సినిమాల్లో నటించింది. హిందీ లో వివిధ పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొంది తనుశ్రీ  దత్త. 

 

 అవసరాల శ్రీనివాస్ జననం : ప్రముఖ తెలుగు సినీ నటుడు దర్శకుడు మరియు సంగీత దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్,  డైలాగ్ రైటర్ అయిన అవసరాల శ్రీనివాస్ 1984 మార్చి 19వ తేదీన జన్మించారు. ఈయన ఎన్నో సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా డైలాగ్ రైటర్ గా పని చేశారు. ఇక కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు అవసరాల శ్రీనివాస్ . తన స్క్రిప్ట్ రైటింగ్ తోనే కాకుండా తన నటనతో కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 

 

 రఘువరన్ మరణం : దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు... ప్రతినాయక పాత్రల్లో నటించి ఇప్పుడు వరకు ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి రఘువరన్. దాదాపు 150 సినిమాల్లో నటించారు. తెలుగు తమిళంతో పాటు కన్నడ మలయాళ సినిమాల్లో కూడా ప్రతినాయకుడి పాత్రలో నటించి ఎన్నో ప్రశంసలు అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు. రఘువరన్ 2009 మార్చి 19వ తేదీన మరణించారు. 

 

 

 మాడభూషి అనంతశయనం అయ్యంగారు మరణం : ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పార్లమెంటు సభ్యుడు లోక్సభ స్పీకర్ అయిన మాడభూషి అనంతశయనం అయ్యంగారు 1978 మార్చి 19వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: