మార్చి 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఇంకా ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి.  మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి. ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 చిర్రావూరి లక్ష్మీనరసయ్య జననం : తెలంగాణ పోరాట యోధుడు కమ్యూనిస్టు నాయకుడు అయిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య 1917 మార్చి 20వ తేదీన జన్మించారు. ఖమ్మం జిల్లాలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య... విద్యార్థి దశలోనే విప్లవకారుల చరిత్ర అధ్యయనం  కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారు. 1945లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభలో సంస్థ ప్రధాన కార్యదర్శిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు చిర్రావూరి లక్ష్మీనరసయ్య. ఇక వీర తెలంగాణ సాయుధ పోరాటంలో... అగ్రభాగాన ఉండి... ఓ ద్రోహి  కారణంగా 1950లో అరెస్టయ్యారు. 

 

 దాట్ల దేవదానం రాజు జననం  : ప్రముఖ కథకుడు ఉత్తమ ఉపాధ్యాయుడు ఆదర్శ అభ్యుదయ వాది అయినా దాట్ల దేవదానం రాజు... 1954 మార్చి 20వ తేదీన జన్మించారు. అనేక కథలు కవితా సంపుటాలు రాశారు. కేవలం కథలు కవితా సంపుటాలు కాకుండా.. యానాం చరిత్ర వంటి గ్రంథాలను కూడా రచించారు. ఈయన  ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన రచనలు కవితలు రాసి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇక ఈయన రాసిన రచనలు కవితలు ఎంతో ప్రేక్షకాదరణ కూడా పొందాయి. ఇక ఈయన చేసిన కృషికి గాను ఎన్నో అవార్డులు కూడా ఆయనను వరించాయి. 

 

 

 ఈటెల రాజేందర్ జననం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 1964 మార్చి 20వ తేదీన జన్మించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి విజయకేతనం ఎగురవేసిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు. వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేత గా ఉన్న రాజేందర్.. తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. ఇక 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచి కెసిఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక రెండవ సారి కెసిఆర్ అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ కీలక నేతగా కెసిఆర్ సన్నిహితుడిగా ముందుకు సాగుతున్నారు ఈటల రాజేందర్. 

 

 రీచా గంగోపాధ్యాయ్ జననం  : ప్రముఖ సినీ నటి రిచా గంగోపాధ్యయ్  సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఈమె 1989 మార్చి 20వ తేదీన జన్మించారు. రిచా  గంగోపాధ్యాయ్ 2007లో మిస్ ఇండియా టైటిల్ ని కూడా గెలుచుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇప్పటి వరకు తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోల సరసన నటించింది ఈ అమ్మడు . తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది. రవితేజప్రభాస్వెంకటేష్, నాగార్జున లాంటి హీరోల సినిమాల్లో నటించింది రిచా గంగోపాధ్యాయ్. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు... అందచందాలతో ప్రేక్షకులను ఆకర్షించింది. 

 

 మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం : ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351 లో మరణించారు. 

 

 సర్ ఐజాక్ న్యూటన్ మరణం : ప్రముఖ ఆంగ్లేయ భౌతిక,గణిత,ఖగోళ శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ 1726 మార్చి 20వ తేదీన మరణించారు. ప్రపంచంలోనే అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడు అంటూ కొనియాడబడిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సు గా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. 

 

 

 శోభన్ బాబు మరణం : తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడి గా పేరు తెచ్చుకుని ఎన్నో ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగిన శోభన్ బాబు  2008 మార్చి 20వ తేదీన మరణించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ముఖ్యంగా తన చలనచిత్ర జీవితంలో ఎన్నో ప్రేమ కథ లతో  విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు శోభన్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: