మే 8వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 గిరిజా దేవి జననం : సేని యా బెనారస్ ఘరానా కు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి. ఈమె లలిత శాస్త్రీయ సంగీతంతో పాటు తుమ్రిలను గానం చేస్తూ ఉంటుంది. గిరిజా దేవి 1929 మే 8వ తేదీన జన్మించారు. వారణాసిలో ఒక జమిందార్  కుటుంబంలో జన్మించారు... హార్మోనియం వాయించే తండ్రి రాందేవ్ రాయ్  మొదటి గురువుగా శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ఈ 5వ ఏట నుంచి ప్రముఖ సంగీత విద్వాంసులు సర్దు  ప్రసాద్  మిశ్రా  వద్ద.. ఖయాల్  టప్పాల్  పాడటం నేర్చుకుంది గిరిజాదేవి. ఈమెకు 1946 లో ఒక వ్యాపారస్తుడు తో వివాహం జరిగింది. గిరిజా దేవి తొలిసారి ఆకాశవాణి అలహాబాద్ కేంద్రం ద్వారా 1949 వ సంవత్సరంలో బహిరంగంగా పాడారు. కానీ ఉన్నత వర్గానికి  ప్రజలు ఇలా బహిరంగంగా ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయం కాదని తన తల్లి నుండి వ్యతిరేకత రావడంతో... కొన్నాళ్లపాటు ఈమె సంగీతం కేవలం నాలుగు గోడలకు మాత్రమే పరిమితమైంది. చివరికి తన సంగీత కళలు అందరికీ చాటి చెప్పాలని భావించి  1951లో బీహార్ లో తన తొలి సంగీత ప్రదర్శన చేసింది. 1990 తొలినాళ్లలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత శాఖలో పనిచేసి  పలువురికి సంగీత పాఠాలు నేర్పి తన సంగీత వారసత్వాన్ని నిలుపుకొన్నది  గిరిజాదేవి. ఈమె తరచూ పలుచోట్ల పర్యటిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇక సంగీతం లో ఈమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్,  పద్మవిభూషణ్ పురస్కారాలు కూడా అందించింది. అంతే కాకుండా మరెన్నో అవార్డుల్ని కూడా అందుకున్నారు గిరిజా దేవి. 

 

 ఫ్రెడరిక్ హేయక్ జననం : ప్రముఖ ఆర్థికవేత్త అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఫ్రెడరిక్ హేయక్  అర్థశాస్త్రం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. 1899 మే  8వ తేదీన జన్మించారు ఫ్రెడరిక్ హేయక్ . ఈయన  అర్థశాస్త్రంలో చేసిన సేవలకుగాను ఏకంగా నోబెల్ బహుమతి పొందారు. 

 

 

 హెన్రీ డ్యూనాంట్ జననం : రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ స్థాపకుడు అయిన హెన్రీ డ్యూనాంట్ 1828 మే 8వ తేదీన జన్మించారు. ఈయన రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ద్వారా ఎంతగానో సేవలు అందించారు. హేన్రి  డ్యూనంట్  మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 

 

 

 తాపీ ధర్మారావు నాయుడు మరణం : తెలుగు రచయిత తెలుగు భాష పండితుడు హేతువాది నాస్తికుడు అయినా తాపీ ధర్మారావు 1973 8వ తేదీన మరణించారు. 

 

 టీ కృష్ణ మరణం : తెలుగు చలనచిత్ర ఎడిటర్ దర్శకుడు ప్రతిఘటన రేపటి పౌరులు,  నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి అయిన టి  కృష్ణ 1987 మే 8వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: