జూన్ 11వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి హిస్టరీలోకి వెళ్లి  నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 అబూ  అబ్రహం జననం  : భారతీయ వ్యంగ్య చిత్రకారుడు పాత్రికేయుడు రచయిత అయిన అబూ  అబ్రహం 1924 జూలై 11వ తేదీన జన్మించారు. ఇతని కలం పేరు అబ్బు. ఈయన  హేతువాది నాస్తికుడు. ఈయన 40 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో అనేక జాతీయ అంతర్జాతీయ వార్తాపత్రికలు కూడా పనిచేశారు... కేరళ రాష్ట్రంలో జన్మించిన ఈయన దేశ ప్రధాని అయినా ఇందిరాగాంధీ వీరాభిమాని. కానీ 1975లో భారత అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన సమయంలో పత్రిక  స్వేచ్ఛను ఇందిరాగాంధీ రద్దు చేయడంతో ఈ చర్యతో ఇందిరాగాంధీ పై ఉన్న అభిమానాన్ని కోల్పోయారు. ఇక భారత దేశంలో ఎమర్జెన్సీ ఉన్న సమయంలో రాజకీయ కార్టూన్లు వ్యాసాలు ప్రచురించ లేకపోయినప్పటికీ వాటన్నింటినీ కలిపి గేమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అని ఒక పుస్తకం కూడా విడుదల చేశారు. 

 

 మేకపాటి రాజమోహన రెడ్డి జననం  : భారత పార్లమెంటు సభ్యుడు అయినా మేకపాటి రాజమోహనరెడ్డి 1944 జూన్ 11వ తేదీన జన్మించారు. ఈయన 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు గల రాజకీయ నాయకుడిగా ఎదిగారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. 2014- 19 సంవత్సరాలకు నెల్లూరు నగర పార్లమెంటు సభ్యుడిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. శాసనసభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా ఎమ్మెల్సీగా ఇలా రాజకీయాల్లో పలు  పదవులను అలంకరించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి.

 

 లాలూ ప్రసాద్ యాదవ్ జననం : ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు అయిన prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ 1947 జూన్ 11వ తేదీన జన్మించారు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఈయన  ఏడు సంవత్సరాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పాలన సాగించారు లాలూ ప్రసాద్ యాదవ్. గడిచిన రెండు దశాబ్దాల లో బీహార్ రాజకీయాల్లో prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ ప్రబలమైన వ్యక్తి. కోల్ కుత్తా  విశ్వ విద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడం ఆయన రాజకీయ జీవితానికి తొలిమెట్టుగా మారింది. జయప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థులకు ఉద్యమానికి prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ 1970లో నాయకత్వం వహించారు, విద్యార్థి నాయకుడైన prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ భారత ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కి వినతి శాసనాన్ని అందించిన ధీశాలి. కేవలం పది సంవత్సరాల వ్యవధి లోనే బీహార్లో మహోన్నత  శక్తిగా ఎదిగారు లాలూ ప్రసాద్ యాదవ్. 1990 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బీహార్ లో జరిగిన అభివృద్ధికి గాను ఏకంగా ప్రపంచబ్యాంకు నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు లాలు  ప్రసాద్ యాదవ్. 

 

 బన్నీ వాసు జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ప్రొడ్యూసర్ పైన బన్నివాసు తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు ఈయన 1981 జూన్ 11వ తేదీన జన్మించారు. ప్రస్తుతం గీత ఆర్ట్స్ 2 కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు బన్నీవాసు. స్టైలిష్ స్టార్ బన్నీ కి వీరాభిమాని అయిన బన్నీ వాసు ఆయన పేరు ముందు బన్నీ అనే పేరును చేర్చుకున్నారు. ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ప్రతి రోజు పండుగే,  గీత గోవిందం, నాపేరు సూర్య లాంటి సినిమాలను కూడా నిర్మించారు బన్నీవాసు. 


 బిఎస్ మాధవరావు  మరణం : కన్నడ దేశానికి చెందిన వలసవెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త బి ఎస్ మాధవ్ రావు 1987 జూన్ 11వ తేదీన మరణించారు.. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఈయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్నమెంట్ టెక్నాలజీ పూణేలో బాలిస్టిక్ ప్రొఫెసర్గా పని చేశారు. ఆ సంస్థలోనే పదవి విరమణ కూడా పొందారు, ఈయన థియరిటికల్ ఫిజిక్స్ లో గ్రూప్ థియరీ మోడర్న్ బీజగణిత అంశాల్లో పరిశోధనలు చేశారు. ఇక 1945లో ఎస్ రామానుజన్ ప్రైస్ కూడా మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు ఈయన. 

 

 ఘనశ్యాం దాస్ బిర్లా మరణం : జెడి బిర్లా గా  పిలువబడే ఘనశ్యాం దాస్ బిర్లా భారతదేశపు అతిపెద్ద వ్యాపార సముదాయానికి యజమాని. వ్యాపార రంగంలో ఈయన చేసిన కృషికి గాను 1955 లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అనే పురస్కారం ఇచ్చి సత్కరించింది. 1983 జూన్ 11వ ఈయన  తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: