జూన్ 22వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 అమ్రీష్ పురి జననం : ప్రముఖ భారతీయ నటుడు అయిన అమ్రిష్ పురి సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితులే. అమ్రిష్ పురి 1932 జూన్ 22వ తేదీన జన్మించారు. ఈయన సోదరుడు మదనపూరి  కూడా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడే . అమ్రిష్ పురి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించారు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ అమ్రిష్ పురి కి  మాత్రం  ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఆయన డైలాగ్ డెలివరీకి ఆయన నటనకు ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఫిదా అవ్వని  సినీ ప్రేక్షకుడు లేదు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ, దళపతి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. 

 

 గణేష్ పాత్రో జనం : ప్రముఖ నాటక రచయిత సినీ రచయిత అయిన గణేష్ పాత్రో 1945 జూన్ 22వ తేదీన జన్మించారు. విజయనగరం జిల్లాలో జన్మించిన గణేష్ పాత్రో  విద్యార్థి దశ నుంచే నాటకాల్లో నటించడం ప్రారంభించారు.పాఠశాల పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా చదవడం ప్రారంభించారు గణేష్ పాత్రో. కొడుకు పుట్టాల అనే నాటకంతో  ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఈయన . ఈ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి కూడా అనువాదమైంది. ఆకాశవాణి దూరదర్శన్ లలో కూడా ప్రసారమైంది. ఈయన ఎన్నో సినిమాలకు కూడా రచయితగా పనిచేశారు. ముఖ్యంగా నేటి తరానికి గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల తో కలిసి సంభాషణలు సమకూర్చారు గణేష్ పాత్రో. 

 

 దేవినేని నెహ్రూ జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి అయిన దేవినేని నెహ్రూ విజయవాడలో కీలక నేత. ఈయన  1954 జూన్ 22వ తేదీన జన్మించారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి 4 సార్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దేవినేని . విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు దేవినేని నెహ్రూ. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కి వెళ్లి మళ్లీ తెలుగుదేశం పార్టీకి తిరిగి వచ్చారు. అయితే దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్.

 

 ఎల్వి ప్రసాద్ మరణం : తెలుగు సినిమా నిర్మాత దర్శకుడు నటుడు దాదాసాహెబ్ఫాల్కే అవార్డు గ్రహీత అయిన v prasad OLD' target='_blank' title='ఎల్ వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎల్ వి ప్రసాద్ 1908 జనవరి 17వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. హిందీ తమిళ తెలుగు కన్నడ వంటి పలు భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటం  నిర్మించడం నటించడం చేశారు, ఎల్.వి.ప్రసాద్ హిందీ తమిళ తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రమైన ఆలం ఆరా,  కాళిదాస్,  భక్తప్రహ్లాద మూడింటిలోనూ నటించారు. తెలుగు వాళ్ళలో  ఈ ఘనత సాధించింది ఆయన ఒక్కరే . ఈయన 1994 జూన్ 22వ   తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: