జూన్ 28 వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి.  మరొకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 

 బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు జననం : ప్రముఖ తెలుగు రచయిత సంపాదకులు ఉపన్యాసకులు అయినా బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు 1920 జూన్ 28వ తేదీన జన్మించారు. తెలుగులో ఎమ్ఏ  పట్టా పొందిన బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు.. తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో  సంగ్రహకులుగా  శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ సహాయ సంపాదకుడిగా ఉన్నాడు.ఈయన  రచించిన రచనలు ఎన్నో ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో ఆయన రచయితగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. 

 

 పీవీ నరసింహారావు జననం  : భారత ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించి దేశ రాజకీయాలలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి పీవీ నరసింహారావు. ఈయన 1921 జూన్ 28 వ తేదీన జన్మించారు. ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు  ఒకే ఒక తెలుగువాడు పివి నరసింహారావు, ఆయన బహుభాషావేత్త రచయిత, ప్రధానమంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసింది పీవీ నరసింహారావు, ఈయన  పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు, కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి తనదైన విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించిన ఘనత  ఈయనకే సొంతం, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఇలా రాజకీయాల్లో  ఎన్నో పదవులను అలంకరించారు పీవీ నరసింహారావు, కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం అనే చెప్పాలి. 

 


 ముళ్ళపూడి వెంకటరమణ జననం : తెలుగు రచయిత తెలుగు నవలలు కథలు సినిమా కథలు హాస్య కథలు రాసిన వ్యక్తి అయిన ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 వ తేదీన జన్మించారు. ముఖ్యంగా హాస్య రచన లకు కేరాఫ్ అడ్రస్గా ఎంతగానో ప్రసిద్ధి గాంచాడు ముళ్ళపూడి వెంకటరమణ. ఈయన రచించిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉన్న విషయం తెలిసిందే, ఇక బాపు  సహచరుడిగా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగారు ముళ్ళపూడి వెంకటరమణ. బాపు దర్శకత్వం వహించిన ఎన్నో  సినిమాలకు రచయితగా పనిచేశారు. 

 


నల్లపాటి వెంకటరామయ్య మరణం : ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ అయిన నల్లపాటి వెంకటరామయ్య 1983 జూన్ 28 వ తేదీన మరణించారు. 1932లో తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1952 లో మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికల్లో  నరసరావుపేట శాసనసభా  స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఇక మొదటి సారి శాసనసభకు ఎన్నికవడమే  సభాపతిగా కూడా ఎన్నికయ్యాడు నల్లపాటి వెంకటరామయ్య, స్వతహాగా న్యాయవాదిగా  కొనసాగిన ఈయన  శాసనసభలో ఎంతో చట్టబద్దంగా నడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: