గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 16వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు


1945: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.
1968: 'మెడిసిన్‌ అండ్‌ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు.
1985: భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.
1990: నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది.


ప్ర‌ముఖుల జననాలు

1854: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (మ.1900). ఆస్కార్ వైల్డ్' (అక్టోబర్ 16, 1854 – నవంబర్ 30, 1900) ఐర్లండుకు చెందిన ఒక నాటక రచయిత, నవలా రచయిత, కవి, కథా రచయిత. ఆయన రచనల్లోని చతురత పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. లండన్ ను విక్టోరియా రాణి పరిపాలించే కాలంలో ఆయన ప్రముఖ రచయితల్లో ఒకడిగానే కాక ఆయన సమకాలికుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981)దండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 - ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈయన 1963లో విడుదలైన నర్తనశాల. సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలోనూ, భీముని పాత్ర పోషించాడు.

1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత. నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సుప్రసిద్ధ రచయిత. 1980లలోను 1990లలోను ఈయన కథలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైనాయి. సాధారణమైన రాయలసీమ వాడుక భాషలో, పిల్లల తేలికగా పాఠాలు అర్థం చేసుకోవడం కోసం కూడా కొన్ని పుస్తకాలు రచించాడు.తన జీవితానుభవాలనే కతలుగా రచించి పాఠకుల మన్ననలు పొందాడు. విలక్షణమైన ఆయన రచనాశైలిని, చమత్కారాన్ని బాపూ, స్వర్గీయ పీ.వీ.నరసింహారావు మొదలైన ప్రముఖులెందరో ప్రశంసించారు.
1948: హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి.
1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు.

ప్ర‌ముఖుల మరణాలు..

1958: తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911)

పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ ఆహార దినోత్సవం
ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: