గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్‌20వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం..

ముఖ్య సంఘటనలు


1774: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్‌ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.
1920: సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1947: భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్. దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004–2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్ ల సమాహారం) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో ముహమ్మద్ అలీ జిన్నా ఒక్కరు.
1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్‌పై దాడి చేసింది.

ప్ర‌ముఖుల జననాలు

1855: గోవర్ధన్‌రాం త్రిపాఠీ - గుజరాతీ నవలా రచయిత. (మ.1907)
1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)
1935: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018)
1938: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)
1951: కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
1978 : వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
1986 : ప్రియాంక శర్మ, భారతీయ నటి.

ప్ర‌ముఖుల మరణాలు

1990: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)
2010: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (జ.1919)
2011: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)

మరింత సమాచారం తెలుసుకోండి: