గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 27వ ‌తేదీకి  చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1920: భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు.
1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1971: కాంగో దేశం పేరు "రిపబ్లిక్ ఆఫ్ జైర్"గా మార్చబడింది.


ప్ర‌ముఖుల జననాలు

1542: అక్బర్‌, మొఘల్ చక్రవర్తి. (మ.1605)
1728: ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు.ఆస్ట్రేలియా, అధికారిక నామం కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా, భూగోళం యొక్క దక్షిణ భాగంలో, పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. ఇది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం., సాంప్రదాయిక 7 ఖండాలలో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం.
1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919)
1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (మ.1929)
1920: కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005)కొచెరిల్ రామన్ నారాయణన్. (1921 ఫిబ్రవరి 4 - 2005 నవంబరు 9) భారతదేశ 10వ రాష్ట్రపతి. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. పాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. నెహ్రూ ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగిగా నారాయణన్ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు.
1936: పర్వతనేని ఉపేంద్ర, ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు.
1939: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (మ.2002)


ప్ర‌ముఖుల మరణాలు

1795: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (జ.1774)
1914: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు, పండితులు, కవి శిఖామణి.
1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
1986: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (జ.1905)


పండుగలు , జాతీయ దినాలు
పదాతి దళ దినోత్సవం.
శిశు దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: