గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 30వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


1835: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910)మార్క్‌ ట్వైన్‌ రచనలలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఆయన వాడిన మాండలికం. తరువాత చెప్పుకోదగ్గది ఆయన చలోక్తులు. ఆయన రాసిన టామ్‌ సాయర్‌ ప్రపంచ సాహితీ రంగంలో ఆయనకి ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టింది. అమెరికా అంతర్యుద్ధం పూర్తి అయి, జీవితాలు స్థిరపడుతూన్న ఆ స్వర్ణయుగపు రోజుల్లో (గిల్టు శకం) మార్క్‌ ట్వైన్‌ పుస్తకాలు వేడి వేడి పకోడీల్లా అమ్ముడు పోయి ఆయనకి కీర్తితో పాటు అయిశ్వర్యాన్ని కూడా తెచ్చి పెట్టేయి.
1858: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
1937: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005)
1945: వాణీ జయరాం, గాయని.వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.
వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో జన్మించారు. వాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నే ఆవిడ ఆల్ ఇండియా రేడియో పాల్గొన్నారు.
వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
1957: శోభారాజు, గాయని.
1990: మాగ్నస్ కార్ల్‌సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
: వెన్నెలకంటి, తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత.
1996: నర్రా ప్రవీణ్ రెడ్డి , తెలుగు కవి, రచయిత, పరిశోధకులు.

మరణాలు

1900: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (జ.1854)ఆయన రచనల్లోని చతురత పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. లండన్ ను విక్టోరియా రాణి పరిపాలించే కాలంలో ఆయన ప్రముఖ రచయితల్లో ఒకడిగానే కాక ఆయన సమకాలికుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత. (జ.1853)
1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
2011: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)

మరింత సమాచారం తెలుసుకోండి: